iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం.. రానున్న 3 రోజులు వానలే..!

తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం.. రానున్న 3 రోజులు వానలే..!

గతకొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు వానాలు, మరికొన్ని రోజు తీవ్రమైన ఎండలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం రాత్రి కూడా రెండు  తెలుగు రాష్ట్రాల్లోనే పలు ప్రాంతాల్లో  తేలిక పాటి వర్షం కురిసింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక అప్ డేట్  ఇచ్చింది. రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పలు జిల్లాలో తేలిక నుంచి ఓ మోస్తారు వానులు కురుస్తాయని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలో వానలు కురవనున్నాయి.

బుతుపవన ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్ల మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో పలు ప్రాంతాల్లో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఐఎండీ  తెలిపిన ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉమ్మడి విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. అదే విధంగా కృష్ణా, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, , ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ  కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, హైదరాబాద్ , కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిర్మల్ , నల్గొండ, సంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.