Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎలో అలర్ట్‌

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షాకాలం ముందుగానే ప్రారంభం అయ్యింది. జూన్‌ 1 నుంచే తెలుగు స్టేట్స్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దాంతో ఈ నెల ప్రారంభం నుంచి ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని రోజులు బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడటంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురిశాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌ జారీ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా నేడు అనగా గురువారం నాడు రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. రానున్న రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

నేడు అనగా గురువారం నాడు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైరదాబాద్‌ వాతావరణ శాఖ అధకారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలకు తోడు.. ద్రోణి ప్రభావం కారణంగా నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడమే కాక ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

ఇక నేడు అనగా గురువారం నాడు ఉదయం నుంచే హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల సన్నగా చినుకులు మొదలయ్యాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం, సాయంత్రానికి నగరంలో జోరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించారు.

అలానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు అనగా గురువారం, శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

అక్కడక్కడా పిడుగులు పడొచ్చని.. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కనుక జనాలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో అవరసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. ఇక నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పుకొచ్చిన అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Show comments