Dharani
IMD Rain Alert-AP,TG: రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
IMD Rain Alert-AP,TG: రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
Dharani
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా.. మళ్లీ దంచికొట్టడం మొదలు పెట్టాయి. ఇక బుధవారం రాత్రి నుంచి భాగ్యనగరంలో జోరు వానలు దంచి కొడుతున్నాయి. ఇందుకు కారణం.. పశ్చిమబెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో ఐదు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక బంగాళాఖాతంలో కాకుండా భూ ఉపరితలంపై అల్పపీడనాలు ఏర్పడే పరిస్థితులు కనిసిస్తున్నాయి అంటున్నారు. ఈ కారణంగానే రానున్న రెండు, మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావం కారణంగా కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.
ఇక బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అత్తాపూర్, టోలిచౌకి, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక మిగిలిన ఏరియాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
ఏపీలో కూడా ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల పాటు.. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం.. దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు.. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అంచనా వేసింది. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖ జిల్లాలో భారీ వర్షంలో పాటుగా 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది.