Heavy Rains: బంగాళాఖాతంలో భీకర పరిస్థితులు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షం ముప్పు

IMD Alert To AP, Telangana: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ వివరాలు..

IMD Alert To AP, Telangana: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ వివరాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం కారణంగా గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు కాస్త శాంతించిన వరుణుడు.. తిరిగి తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. అల్పపీడనంగా మారి ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్యప్రదేశ్‌‌పై అలాగే ఉందని చెప్పుకొచ్చింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, దక్షిణ భారత్.. మూడు చోట్లా ద్రోణి వాతావరణం ఉందని తెలిపింది. ఇది నేటి నుంచి అనగా బుధవారం నుంచి 3 రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దీనికి తోడు.. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వారం మొత్తం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

నేడు అనగా సెప్టెంబర్ 4, బుధవారం నాడు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల భారీగా కురుస్తాయని చెప్పకొచ్చింది. ఏపీలో కూడా కోస్తా, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పుకొచ్చింది. మంగళవారం రాత్రి నుంచి తెలంగాణలో వర్షం కురుస్తుంది. ఇది నేడంతా కొనసాగుతుందని.. హైదరాబాద్ లో నేడు అనగా బుధవారం నాడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.

సెప్టెంబర్ 5న ఏర్పడే అల్పపీడనం కూడా ద్రోణి ప్రభావం కూడా బలంగానే ఉండేలా కనిపిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దాని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ద్రోణి ప్రభావం కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై కనిపించేలా ఉంది. ఇక నేడు రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా మేఘాలుంటాయి. ఎండ పెద్దగా కనిపించదని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.

Show comments