Dharani
IMD Heavy Rain Alert To AP And Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆ వివరాలు.
IMD Heavy Rain Alert To AP And Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆ వివరాలు.
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిండుకుండలా మారాయి. ఇదిలా ఉండగా.. వర్షాలు ఇప్పట్లో తగ్గవని.. మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానల కారణంగా.. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు. మరో మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాక అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.
కరీంనగర్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి మొదలైన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శౠఖ అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులకు తోడు పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మంగళవారం కూడా ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.