IMD Alert 3 Days Rain In AP, TG: తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్‌ మరో 3 రోజులు అతి భారీ వర్షాలు

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్‌ మరో 3 రోజులు అతి భారీ వర్షాలు

IMD Rain Alert-AP, TG: రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. మరో మూడు రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆ వివరాలు..

IMD Rain Alert-AP, TG: రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. మరో మూడు రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆ వివరాలు..

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. మన దగ‍్గరే కాక.. యావత్‌ భారతదేశం అంతా భారీ వర్షాలు కురవడంతో.. అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇక తాజాగా కేరళలో వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వందల మంది మృతి చెందారు.. వేల మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఎత్తన ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇక గురువారం సాయంత్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కుండపోత వాన కురిసింది. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన వాన కొన్ని ప్రాంతాల్లో 9 గంటలకు వరకు అంటే మూడు గంటల పాటు కొనసాగింది. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోడ్లు కాలువల్ని తలపించాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని అనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడమే కాక.. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

ఇక తెలంగాణలోని మరో మూడు రోజులు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

అలానే ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

మరో రెండు, మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో.. జనాలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో.. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్లు క్రింద, కరెంట్ పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Show comments