iDreamPost
android-app
ios-app

కక్కుర్తి పడి ఎలక్షన్ మందు తాగుతున్నారా? మీ ప్రాణాలు ఔట్!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నిక పండగ ప్రారంభమైంది. ఇక ఎన్నికలు అంటే..ప్రచారం, ర్యాలీలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్యక్రమాలు గుర్తుకు వస్తాయి. ఇదే సమయంలో మద్యం ఏరులై పారుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నిక పండగ ప్రారంభమైంది. ఇక ఎన్నికలు అంటే..ప్రచారం, ర్యాలీలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్యక్రమాలు గుర్తుకు వస్తాయి. ఇదే సమయంలో మద్యం ఏరులై పారుతోంది.

కక్కుర్తి పడి ఎలక్షన్ మందు తాగుతున్నారా? మీ ప్రాణాలు ఔట్!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎండకాలం వేడిని మించి.. రాజకీయ వేడి కనిపిస్తోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తైంది. నాలుగో విడత పోలింగ్ కి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగో విడత పోలింగ్ లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే.. ఎన్నికలు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మద్యం. ఈ  ఎన్నికల సమయంలో మద్యం ఏరులై పారుతుందనే విషయం అందరికి తెలిసిందే. ఈక్రమంలో కొందరు నేతలు నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. అలానే కక్కుర్తి పడి ఎన్నికలు మందు తాగే వారు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే..ప్రాణాలకే ప్రమాదం.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నిక పండగ ప్రారంభమైంది. ఇక ఎన్నికలు అంటే..ప్రచారం, ర్యాలీలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్యక్రమాలు గుర్తుకు వస్తాయి. వీటితో పాటు ఎన్నికల వేళ చీకటి కోణాలు కూడా ఉన్నాయి. నగదు పంపిణీ, మద్యం సరఫరా, బహుమతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అడ్డదారుల్లో గెలవడం కోసం కొందరు రాజకీయ నేతలు ఇలాంటి కార్యక్రమాలకు తెరతీస్తారు. ముఖ్యంగా కొందరు నేతలు గెలుపు కోసం మద్యాన్ని మార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలకు మద్యం ఇచ్చే జనాల్ని తరలిస్తున్నారు.

ఇక ఎన్నికల దగ్గర పడే కొద్ది  గ్రామాల్లో నిత్యం విందులు ఏర్పాటు చేస్తూ మందు పోస్తుంటారు. కొందరు నాణ్యమైన మందుతో పాటు నాసిరకం మద్యం తయారు చేయించి మరీ పంపిణీ చేస్తుంటారు. అత్యంత నాసిరకం మద్యాన్ని, నాటుసారాన్ని జనాలకు పంచుతూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అలా కొన్ని పార్టీలు అందించే మద్యాన్ని శృతిమించి తాగి.. ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎన్నికల వేళ నాసిరకం మద్యం ఏరులై పారుతోంది. ఆ మద్యం తాగి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

కొందరు నేతలు చీప్‌ లిక్కర్‌ కొనాలన్నా ఎక్కువ ఖర్చు అవుతుందని,  నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. ఇలా పోలింగ్‌ సమయం దగ్గర పడటంతో నాసిరకం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఎవరైనా ఎన్నికల వేళ మద్యం ఎక్కడపడితే అక్కడ దొరుకుతుందని తాగితే మాత్రం ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ప్రభుత్వ నివేదిక ప్రకారం.. కల్తీ మద్యానికి బలయ్యే వారంత పేదలే. ప్రాణాంతక కెమికల్ కలిసిన మద్యం తాగడం వల్ల కాలేయం, గుండె, జీర్ణయ కోసం వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అలానే ఎన్నికల వేళ, మాములు సమయంలో ఇష్టాను రితీగా కల్తీ మద్యం తాగి మరణిస్తున్నారు

గతంలో కల్తీ మద్యం, నాసిరకం మందు తాగి మరణించిన వారు వేలలో ఉన్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. 2016-20 మధ్య కాలంలో దేశీయంగా కల్తీ మద్యం కారణంగా 7000 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రేండేళ్ల క్రితం బిహార్ రాష్ట్రంలోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 65 మంది మరణించారు. 2020లో కల్తీ మద్యం వల్ల పంజాబ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో  113 మంది మృతి చెందారు. కల్తీ మద్యం కోరల్లో చిక్కి దేశీయంగా ఏటా వెయ్యి మంది బలవుతున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అలానే బ్రాండెడ్ మద్యాన్నీ స్పిరిట్ తో కల్తీ చేస్తున్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో సైతం పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. మొత్తంగా ఎన్నికల వేళ దొరికే మద్యానికి దూరంగా ఉంటే మేలని పలువురు సూచిస్తున్నారు.