iDreamPost
android-app
ios-app

ఆడ పిల్ల పుడితే రూ. లక్ష డిపాజిట్.. మంగళగిరిలో వినూత్న నిర్ణయం

ఆడ పిల్ల పుడితే అన్ని ఖర్చులేనని ఒకప్పుడు అనుకునేవారు తల్లిదండ్రులు, పెద్దలు. ఆమె గుండెలపై కుంపటని భావించేవారు. కానీ ఆ రోజులకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఎవ్వరైనా పర్వాలేదు అని భావిస్తున్నారు. అయితే ఆడ పిల్లలకు మంచి భవితవ్యాన్ని అందించాలని ఆశపడుతున్నారు.

ఆడ పిల్ల పుడితే అన్ని ఖర్చులేనని ఒకప్పుడు అనుకునేవారు తల్లిదండ్రులు, పెద్దలు. ఆమె గుండెలపై కుంపటని భావించేవారు. కానీ ఆ రోజులకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఎవ్వరైనా పర్వాలేదు అని భావిస్తున్నారు. అయితే ఆడ పిల్లలకు మంచి భవితవ్యాన్ని అందించాలని ఆశపడుతున్నారు.

ఆడ పిల్ల పుడితే రూ. లక్ష డిపాజిట్.. మంగళగిరిలో వినూత్న నిర్ణయం

ఆడ పిల్ల పుడితే ఈసడించుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఆమెను మహాలక్ష్మిలా భావిస్తున్నారు తల్లిదండ్రులు. మగపిల్లాడు వారసుడని, జీవిత చరమాంకంలో తమను చూస్తాడని, పున్నామ నరకం నుండి తప్పిస్తాడనే పాత చింతకాయ పచ్చడికి తిలోదకాలు ఇచ్చేశారు. బిడ్డ ఎవరైనా.. వారిని కష్టపడి చదివించి, ప్రయోజకులను చేయాలని ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లకు మంచి లైఫ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు తల్లిదండ్రులు. మధ్యతరగతిలో పుట్టిన ఆడ పిల్ల చదువుకు, పెళ్లికి, ఇతర అవసరాలకు చాలా ఖర్చు అవుతుంది. ఎవరినీ అడగలేరు. అప్పు అడిగితే.. లేరనేవారే ఎక్కువ. ఇలాంటి సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో ఆ కాలనీ వినూత్న, ఆలోచింపజేసే నిర్ణయం తీసుకుంది.

ఇంతకు ఆ కాలనీ ఎక్కడ ఉందనుకుంటున్నారు.. మన తెలుగు రాష్ట్రంలోనే. ఏపీ రాజధాని అమరావతికి సమీపంగా ఉన్న మంగళగిరిలో ఉంది ఆ కాలనీ. దాని పేరు ఇందిరా నగర్. ఇందులోని కాలనీ వాసులే ఆడ పిల్లల భవిష్యత్తు విషయంలో కీలక నిర్ణయం చేశారు. ఇంతకు అదేంటంటే.. ఎవరికీ ఆడ పిల్ల పుట్టినా లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలన్న ఆలోచన. రెండు రోజుల క్రితం కాలనీ నేత మునగపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యువత సమావేశమై.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐడియా అందరికీ నచ్చడంతో కాలనీవాసులంతా అంగీకారం తెలిపారు. ఈ కాలనీలో దాదాపు 300 మంది సభ్యులున్నారు. ఆడ పిల్ల పుట్టిన సమయంలో ఒక్కక్కరి నుండి 350 రూపాయల చొప్పున వేసుకుని లక్ష రూయాలు కూడబెట్టి.. ఈ లక్షను ఆడ పిల్ల పేరిట డిపాజిట్ చేస్తారు.

ఆ పాప పుట్టిన 21 ఏళ్ల వరకు వాటిని తీయడానికి వీలు లేదు. అప్పటి ఆ లక్ష రూపాయలు రూ. 16 లక్షలు అవుతుంది. ఆ సమయంలో ఆడ పిల్ల చదువుకి, పెళ్లికి ఆ మొత్తాన్ని వినియోగించాలని నిర్ణయం చేసింది కమిటీ. ఈ నిర్ణయాన్ని అందరూ ఆమోదం తెలపడమే కాదూ.. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. వచ్చే ఏడాది నుండి ఈ ఆలోచన అమలు చేయాలని భావిస్తున్నారు. నిజంగా ఈ ఆలోచన చాలా బాగుంది కదా. రూ. 350 ఓ ఆడ పిల్లకు భరోసాగా నిలవడంతో పాటు తన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కారణమౌతుంది. మరీ ఆ కాలనీ వాసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి