iDreamPost
android-app
ios-app

YCP ఎమ్మెల్యే అభ్యర్ధికి అల్లు అర్జున్ ప్రచారం! AP ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్!

  • Published May 11, 2024 | 12:24 PM Updated Updated May 11, 2024 | 12:49 PM

Allu Arjun, AP Elections: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లురు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు.

Allu Arjun, AP Elections: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లురు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు.

  • Published May 11, 2024 | 12:24 PMUpdated May 11, 2024 | 12:49 PM
YCP ఎమ్మెల్యే అభ్యర్ధికి  అల్లు అర్జున్ ప్రచారం! AP ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పీక్ స్టేజ్ లో ఉంది. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను ఒడుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో సెలబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు. పలు పార్టీల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా  ఓ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఏపీలో అడుగు పెట్టారు. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

నేటితో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాల్లో బిజిబిజీగా ఉన్నారు.  ఇది ఇలా ఉంటే.. ఈసారి పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొని సందడి చేస్తున్నారు. మాములుగానే హీట్ పుట్టేంచే ఏపీ ఎన్నికలు సెలబ్రిటీల ప్రచారం మరింత హీటెక్కెతున్నాయి. ఇప్పటికే  టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం వైసీపీ అభ్యర్థికి తరపున, ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న శిల్పా రవిచంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం బన్నీ నంద్యాలకు వెళ్లారు. అలాగే అక్కడ అల్లు అర్జున్, తన ఫ్రెండ్ కి సపోర్టుగా ఎన్నికల  ప్రచారం చేశాడు.

నంద్యాలకు వెళ్లి తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బన్ని విషెష్ చెబుతుండటంతో ఇరువురి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇక తన కోసం వచ్చిన వేలాది మంది అభిమానలుకు బన్నీ అభివాదం చేశాడు. అలానే నంద్యాలకు వచ్చిన అల్లు అర్జున్ కి అక్కడి ప్రజలు, ఆయన అభిమానులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. శనివారం ఉదయం తన భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు.

2019 ఎన్నికల్లో తొలిసారి నంద్యాల నుంచే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో కూడా అల్లు అర్జున్ తన ఫ్రెండ్ రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపారు. తాజాగా కూడా మరోసారి తన స్నేహితుడి కోసం మరోసారి నంద్యాలకు వచ్చారు. శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. అలానే వారిద్దరు క్లాస్ మెంట్స్ కూడా. ఇక వారి స్నేహంతో రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ లు కూడా మంచి స్నేహితులు అయ్యారు. ఇరు కుటుంబాల్లో జరిగే శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి బన్నీ అన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రరెడ్డి తెలిపారు. ఆ మాటలు నిజం చేస్తూ.. తన స్నేహితుడి విజయం కోసం బన్నీ నంద్యాల వచ్చాడు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş