Arjun Suravaram
ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తమ సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో నగరం నుంచి వాహనాలు ఏపీ వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే నగరంలో పాటు బయటకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. శనివారం ఉదయం ఏపీ సరిహద్దులోని టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తమ సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో నగరం నుంచి వాహనాలు ఏపీ వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే నగరంలో పాటు బయటకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. శనివారం ఉదయం ఏపీ సరిహద్దులోని టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Arjun Suravaram
మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ ఓటర్లు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. మే11వ తేదీ శనివారం ఉదయం నుంచి ఆంధ్ర ఓటర్లు.. తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. రేపు ఆదివారం, మండే ఎన్నికల సెలవు కావడంతో.. మొత్తంగా రెండు రోజులు హాలీడే దొరకడంతో సొంతూర్లుకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
భాగ్యనగరంలో లక్షల మంది ఆంధ్రప్రజలను జీవనం సాగిస్తున్నారు. వారు పండగలకు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు తమ సొంతూర్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా పండగల వేళ భాగ్యనగరం బోసిపోయినట్లు అవుతోంది. అలానే తాజాగా మరోసారి అలా కనిపించనుంది. నగరంలోని ఏపీ ఓటర్లు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. మూడు రోజుల సెలవులు దొరకడంతో ఏపీ వైపు పయనమయ్యారు. ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల క్యూ కట్టారు. శనివారం నుంచి వరుస సెలవులతో ఇంటికి వెళ్లుందుకు జనం క్యూ కడుతున్నారు.
శుక్రవారం రాత్రి నుంచి చాలా మంది తమ ఊర్లకు బయలు దేరారు. అలానే శనివారం ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఏపీకి బయలు దేరారు. ఈ క్రమంలోనే విజయవాడ వైపు బయలు దేరే వాహనాలు టోల్ గేట్ల వద్ద భారీగా నిలిచిపోయాయి. కొర్రపాడు టోల్ గేట్ దగ్గర నాలుగు టోల్ బూతులు తెరిచి విజయవాడ వైపు వాహనాలను పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి. అలానే ఎక్కడ ఖాళీ దొరకకపోవడంతో సొంత వాహనాల్లో, ప్రైవేటు వాహనాల్లో ఏపీకి వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న కొర్లపాడు టోల్ గేట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచాయి. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ లేట్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడున్నారు. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ ఆలస్యం అవుతుండటంతో వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాయి. ఊర్లకు వెళ్లే వాళ్లు అనుకున్న సమయం కంటే కాస్తా ముందుగా బయలు దేరితే..మీ గమ్యస్థానాలకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు.
మే13 ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఓట్లు వేసేందుకు సొంతూళ్ల జనం పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని బస్టాండ్లుల్లో, రైల్వే స్టేషన్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడేతో సొంతూర్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే రైళ్లు, బస్సులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.