Krishna Kowshik
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్నారు హిందూ సంఘాల నేతలు. రైలు రోకో నిర్వహించారు. రైల్వే ట్రాకులపై నిలబడి
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్నారు హిందూ సంఘాల నేతలు. రైలు రోకో నిర్వహించారు. రైల్వే ట్రాకులపై నిలబడి
Krishna Kowshik
నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది రైల్వే. ఫుడ్ బాగోలేదని, బెడ్స్ సరిగా లేవని, బాత్రూమ్స్ నీట్‌గా ఉండవని అపవాదు ఉంది. అంతేనా సకాలంలో రైలు రాదని, అలాగే గమ్యస్థానానికి కూడా సమయానికి వెళ్లదని ఆరోపణ ఉంది. అంతే కాకుండా ప్రయాణీకుల అసౌకర్యానికి గురి చేస్తూ ఆగ్రహానికి గురౌతున్నాయి. ఇవే కాకుండా ప్రమాదాలు కూడా రైల్వే వ్యవస్థపై చిన్న చూపు మొదలైంది. ఇటీవల కాలంలో తరచుగా రైళ్లను మార్గ మధ్యంలో నిలిపివేస్తున్న ఘటనలు చూశాం. మొన్నటికి మొన్న ఏసీ పని చేయడం లేదని ప్రయాణీకులే ఓ రైలును నిలిపివేశారు. తాజాగా జన్మభూమి సూపర్ ఫాస్ట్ రైలును అడ్డుకున్నారు. గుంటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
గుంటూరులో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును అడ్డుకున్నారు హిందూ సంఘాల ప్రతినిధులు. రైలులో అక్రమంగా ఆవు మాంసం తరలిస్తున్నారంటూ హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఆవును వధించి అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆందోళన చేశారు హిందూ సంఘాల నేతలు. దీంతో ఆ రైల్వే స్టేషన్ కు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో తాళ్లాయపాలైం శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి సైతం అక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. రైలులో తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలని, గో మాంస తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళుతుండగా గుంటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆవు మాంసాన్ని తరలిస్తున్నారని తెలుసుకున్న హిందూ సంఘాల నేతలు గుంటూరు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని రైల్ రోకో నిర్వహించారు. పట్టాలపై నిలబడి ఆందోళన చేశారు. హిందూ సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహించడంతో పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు. గోమాంసం తరలింపుపై చర్యలు తీసుకోవాలని, ఆవును వధించి.. మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చివరకు అందుకు అంగీకరించడంతో శాంతించారు హిందూ సంఘాల నేతలు. ప్రస్తుతం ఇది గుంటూరులో చర్చకు దారి తీసింది.
ట్రైన్లో ఆవు మాంసం తరలిస్తున్నారంటూ.. గుంటూరు రైల్వే స్టేషన్లో హిందూ సంఘాల ఆందోళన
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఆవు మాంసం తరలిస్తున్నారంటూ హిందూ సంఘాలు గుంటూరు రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న… pic.twitter.com/IyER9ayc1N
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2024