Highest Temperatures in Andhra Pradesh: నిప్పులు చెరుగుతున్న భానుడు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్!

నిప్పులు చెరుగుతున్న భానుడు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్!

Highest Temperatures in Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారే వేడెక్కిపోయింది. ఏపీలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Highest Temperatures in Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారే వేడెక్కిపోయింది. ఏపీలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

వడగాడ్పులు, భారీ ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత పదిరోజుల క్రితం వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.. మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో భానుడు ఉగ్ర రూపందాల్చినట్లు కనిపిస్తుంది. సూర్యుడు చండ్ర నిప్పులు కురిపించడంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కోస్తా జిల్లాలో ఏకంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రత ప్రభావం అస్సలు తగ్గడం లేదు.. ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎండ వేడి తట్టుకోలేక శీతలపానియాల వెంట పడుతున్నారు. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

దేశంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశించినా.. ఎండల తీవ్రత మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఉదయం 9 గంటల నుంచి ఎండ ప్రభావం మధ్యాహ్నం చండ్ర నిప్పులు కురుస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం తట్టుకోలేక ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వాడకం ఎక్కువ కావడంతో విద్యుత్య వినియోగం పెరిగిపోతుంది. ఏపీ ప్రజలకు విపత్తు సంస్థ హెచ్చరిక.. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.

శనివారం విజయనగరం6, పార్వతీ పురం మన్యం 9 మండలంలో తీవ్ర వడగాల్పలు, 43 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు సంస్థ ఎండి రోణం‌కి కూర్మనాథ్ తెలిపారు.అత్యదికంగా పల్నాడు జిల్లాలో వినుకొండలో 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ప్రకాశం జిల్లా పుల్ల చెరువలో 45.4 డిగ్రీలు, గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం, తూళ్లూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. శనివారం రాయలసీమలో పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వృద్దులు, గర్భిణీలు,బాలింతలు, చిన్నారులు తగు జాగ్రత్త చర్యలు పాటించాలని.. చిన్న పిల్లలు, మైనర్లు చెరువుల్లోకి, వేడి గాలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

 

Show comments