అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు ఎల్లుండికి వాయిదా పడింది. ముందుస్తు బెయిల్ పిటిషన్ ను ఎల్లుండికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరపు లాయర్ల కోరారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు ఈ కేసును సెప్టెంబర్ 21తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే సీఐడీ అధికారులు మరో స్కాంను బయటకు తీశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కాంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. కేసును సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. అలానే చంద్రబాబు రిమాండ్ పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున వర్చువల్ లో హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అంతేకాక చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్థార్థ లూథ్రా, హారీష్ సాల్వే, సిద్ధార్థ్ అగర్వాల్ వాదించనున్నారు. అలానే సీఐడీ తరపున సుప్రీం కోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గ్ వాదానలు వినిపించారు.