iDreamPost

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్..!

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్..!

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి విదితమే. ఈ నెల 9న నంద్యాలలో అరెస్టు చేసిన ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విదితమే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రిలో సెంట్రల్ జైలులో ఉన్నారు.  కాగా, ఆయన బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, నేడు విచారణ జరగనుంది. అయితే ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అన్న సందిగ్థత, టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు బెయిల్ రావాలంటూ దేవాలయాలను సందర్శిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడలోని అమ్మవారిని సందర్శించేందుకు వెళ్లారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టు కావడంపై తెలుగు తమ్ముళ్లు హడావుడి చేస్తున్నా.. ప్రజల నుండి మాత్రం మద్దతు రావడం లేదు. చివరకు జన సమీకరణ కోసం నేతలు పడుతున్న తిప్పల గురించి ఆడియో రూపంలో విడుదలైన సంగతి తెలిసిందే. బంద్, పలుమార్లు నిరసనలకు పిలుపునిచ్చినా.. అవన్నీ బెడిసికొట్టాయి. చివరకు ఆ ఇంటి కోడళ్లు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. కాగా, ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణి కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ మాట్లాడే సరికి కౌంటర్లు ఇచ్చారు అధికార వైసీపీ నేతలు. కాగా, చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో దుర్గగుడిలో అమ్మవారికి సారే సమర్పించేందుకు వచ్చారు దేవినేని ఉమా. వినాయకుడి గుడి వద్ద హడావుడి చేస్తుండగా.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి