AP: మండుతున్న ఎండలు.. వాతావరణ శాఖ అలెర్ట్! ఆ సమయాల్లో బయటకి రావద్దు హెచ్చరిక!

ఏపీలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సుమారుగా 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. మండే ఎండలకు తోడు వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనాలు బయటకు వచ్చేందుకు కూడా భయంతో వణికిపోతున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి కాస్తా వాతావరణం చల్లబడింది. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వానాలు కురిశాయి. అయితే మళ్లీ  వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే రాష్ట్రం నిప్పుల కొలిమిలా ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సూర్య తాపానికి విలవిల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిణి సునంద వెల్లడించారు. రాయలసీమ జిల్లాలు అయిన కర్నూలు అనంతపురం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వారు పేర్కొన్నారు. అలానే కోస్తా తీరానికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదు అవుతాయని, అలానే వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని ఆమె తెలిపారు.

ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏదైన అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు ఐఎండీ సూచించింది. రోజురోజుకు భానుడు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాడు. రాష్ట్రంలో పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ రోజుల కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా రికార్డు అవుతాయని తెలిపారు. అలానే అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. ఇక సూర్యుడు విజృభిస్తుండటంతో జనం బెంబేలెత్తున్నారు. బుధవారం వైఎస్సార్‌ కడప జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

 ఇదే సమయంలో జనాలకు కాస్తా ఊరటను ఇచ్చే వార్తను కూడా ఐఎండీ తెలిపింది. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఐఎండీ బుధవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐఏండి పేర్కొంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తంగా ఎండలు, వానల విషయంలో రానున్న మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

Show comments