Dharani
Heavy Rains-School Holiday, In AP On 22nd July 2024: భారీ వర్షాల నేపథ్యంలో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ వివరాలు..
Heavy Rains-School Holiday, In AP On 22nd July 2024: భారీ వర్షాల నేపథ్యంలో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ వివరాలు..
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఏపీ, తెలంగాణలో ఆగకుండా జోరు వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోయి ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వరదల వల్ల ఇళ్లల్లోకి నీళ్లు చేరి.. జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో రెండో రోజుల పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక జోరు వానల నేపథ్యంలో శనివారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే నేడు కూడా వర్షాలు కురుస్తుండటంతో.. ఇవాళ అనగా సోమవారం నాడు కూడా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఆ వివరాలు..
భారీ వర్షాల నేపథ్యంలో.. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదలు, రోడ్డు రవాణా వ్యవస్థ దెబ్బతినడం వల్ల.. అనేక జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇవాళ హాలీడే ప్రకటించిన జిల్లాలు ఏవి అంటే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రకటించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. అలానే అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్‌లో భారీ వర్షాల కారణంగా రెండ్రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్‌కుమార్ ప్రకటించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా రేపు స్కూల్స్‌కి సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పాడేరు డివిజన్‌లో మాత్రం సోమవారం నుంచి విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. అయితే భారీ వర్షాలు కొనసాగుతున్నట్లు మరి కొన్ని జిల్లాలో కూడా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
ఇక తెలంగాణలో కూడా రానున్న మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దాంతో సోమ, మంగళవారం తెలంగాణలోని కొన్ని జిల్లాలకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సెలవులపై తెలంగాణ విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వర్షం తీవ్రతను బట్టి స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.