iDreamPost
android-app
ios-app

ఏపీలోని ఆ 4 జిల్లాల్లో భారీ వర్షాలు! ముఖ్యంగా రాత్రుళ్ళు బయటకి రాకండి!

  • Published Aug 19, 2024 | 5:51 PM Updated Updated Aug 19, 2024 | 5:51 PM

Andhra Pradesh: ప్రస్తుతం వర్షాలు భారీగా పడుతున్న సంగతి తెలిసిందే. అల్ప పీడనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ కి ఎక్కువ ముప్పు ఉంది.

Andhra Pradesh: ప్రస్తుతం వర్షాలు భారీగా పడుతున్న సంగతి తెలిసిందే. అల్ప పీడనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ కి ఎక్కువ ముప్పు ఉంది.

ఏపీలోని ఆ 4 జిల్లాల్లో భారీ వర్షాలు! ముఖ్యంగా రాత్రుళ్ళు బయటకి రాకండి!

ప్రస్తుతం వర్షాకాలం కారణంగా వర్షాలు భారీగా పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్షాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న సందర్భాలూ ఉన్నాయి.ఎండలు, ఉక్కపోతతో ప్రజలు బాగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బంగాళా ఖాతంలో అల్ప పీడనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ కి ఎక్కువ ముప్పు ఉంది. వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 72 గంటలు బయటకి రావడం చాలా ప్రమాదమని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు పడ్డట్లు సమాచారం తెలుస్తుంది.అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల ,వైఎస్సార్ కడప వంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే మూడు నుంచి నాలుగు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో రాత్రిళ్ళు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతుంది. అలాగే బలమైన గాలులు వీచే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

గంటకు ఏకంగా 30 నుంచి 40 కిలోమీటర్ల దాకా వేగంతో ఈ ప్రాంతాల్లో గాలులు వీస్తాయట. అలాగే రేపు ,ఎల్లుండి కూడా భారీగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.రేపు మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశమున్నట్లు తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో రోడ్లు, కాల్వలు, డ్రైనేజీలు భారీ వర్షాలతో పొంగి పొర్లాయి..కాబట్టి ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ సఖ సూచించింది. రాబోయే మూడు రోజుల పాటు కేవలం అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటకి రాకపోవడమే మంచిది.. ముఖ్యంగా రాత్రుళ్ళు మాత్రం అస్సలు బయటకి రాకండి.