School Holiday: తెలుగు ప్రజలకు అలర్ట్‌.. భారీ వానలు.. ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

Heavy Rains-AP, Telangana, School Holiday: రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ, విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

Heavy Rains-AP, Telangana, School Holiday: రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ, విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఇక శుక్రవారం రాత్రి నుంచి భాగ్యనగరం తడిసిముద్దవుతుంది. ఇక బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వానలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. కాగా నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. నేటి నుంచి రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అన్నారు. ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తాయన్నారు.

నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతవారణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసారు. నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించడమే కాక.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. .

ఏపీలో పరిస్థితి ఇలా..

ఇటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కూడా జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా ప్రయాణం చేస్తూ.. వాయుగుండంగా మారినట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం.. వాయవ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అలానే బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నేడు ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో శనివారం నాడు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యల కోసం మూడు ఎస్టీఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జోరు వానల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, కాలువలు పొంగి పోర్లుతున్నాయని.. జనాలు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

Show comments