భారీ వర్షాలు ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

Holidays for Schools: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. భారీ వర్షాల జలాశయాలు, వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Holidays for Schools: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. భారీ వర్షాల జలాశయాలు, వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా వర్షాలు అస్సలు వదలడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి రెండు రోజులు మినహాయించి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఉదయం ఎండలు.. సాయంత్రం భారీ వర్షాలతో ప్రజలు నానా అవస్థ పడుతున్నారు. పశ్చిమ మధ్య అనుకొని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడి అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలపై బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో వర్షాలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఎక్కడ చూసినీ వరదనీరు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలతో పాటు అనకాపల్లి జిల్లాల్లోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Show comments