iDreamPost
android-app
ios-app

భారీ వర్షాలు కారణంగా.. 3 రోజులు విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు

  • Published Aug 31, 2024 | 9:11 PM Updated Updated Aug 31, 2024 | 9:11 PM

Vijayawada Division, Trains Cancelled: ప్రస్తుతం ఏపీలోని విజయవాడ, గుంటూరు నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..  విజయవాడ డివిజన్‌ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

Vijayawada Division, Trains Cancelled: ప్రస్తుతం ఏపీలోని విజయవాడ, గుంటూరు నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..  విజయవాడ డివిజన్‌ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

  • Published Aug 31, 2024 | 9:11 PMUpdated Aug 31, 2024 | 9:11 PM
భారీ వర్షాలు కారణంగా.. 3 రోజులు విజయవాడ డివిజన్ పరిధిలో  పలు రైళ్లు రద్దు

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోని నదులు, కాలువలు, చెరువులు పొంగిపోతుండంతో రహదారులన్ని జలమైయమవుతన్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివాసించే వారి ఇళ్లలోకి వరద నీరు చేరిపోవడంతో.. జన జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఇక భారీ వర్షాలకు తోడు బలమైన గాలులు వీయడంతో పెద్ద పెద్ద చెట్లు విరిగిపోవడం, కొంచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

దీంతో ప్రస్తుతం ఈ రెండు నగరాల్లో పరిస్థితులు చూస్తుంటే స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా నేటి  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే..  విజయవాడ డివిజన్‌ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అయితే  భారీ వర్షాలు కారణంగా..  భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ముఖ్యంగా నేటి నుంచి ( శని, ఆది, సోమవారం) మూడు రోజుల పాటు దాదాపు 20 రైళ్లు రద్దయ్యాయి. కాగా, వాటిలో విజయవాడ- తెనాలి, విజయవాడ- గూడురు, తెనాలి- రేపల్లె, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నిడదవోలు, గుంటూరు- రేపల్లె, విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- ఒంగోలు తదితర టౌన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు రద్దుయ్యాయి. కనుక ఈ మూడు రోజుల్లో ఆయా రైళ్లలో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, అందుకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు ప్రయాణికులు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. మరీ, భారీ వర్షాల కారణంగా మూడు రోజుల పాటు రైళ్లు రద్దు కావడం పై మీ అభిపప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.