Arjun Suravaram
చాలా మంది ప్రజాప్రతినిధులు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అలా అవకాశం దొరినప్పడుల్లా అందినకాడికి దోచుకుంటారు. అంతేకాక ప్రభుత్వాన్నికి చెల్లించాల్సిన పన్నులను, ఇతర ఫీజులను ఎగ్గొడుతుంటారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు అధికారులు భారీ జరిమానా విధించారు.
చాలా మంది ప్రజాప్రతినిధులు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అలా అవకాశం దొరినప్పడుల్లా అందినకాడికి దోచుకుంటారు. అంతేకాక ప్రభుత్వాన్నికి చెల్లించాల్సిన పన్నులను, ఇతర ఫీజులను ఎగ్గొడుతుంటారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు అధికారులు భారీ జరిమానా విధించారు.
Arjun Suravaram
చాలా మంది ప్రజాప్రతినిధులు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అలా అవకాశం దొరినప్పడుల్లా అందినకాడికి దొచుకుంటారు. అంతేకాక ప్రభుత్వాన్నికి చెల్లించాల్సిన పన్నులను, ఇతర ఫీజులను ఎగ్గొడుతుంటారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కంపెనీలపై అధికారులు తనిఖీలు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు అధికారులు భారీ జరిమానా విధించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సూర్యనారయణకి చెందిన నితిన్ సాయి కన్ స్ట్రక్షన్ సంస్థ పేరిట అనంతపురం గ్రామీణ మండలం క్రిష్టంరెడ్డిపల్లి సమీపంలో స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న క్వారీ నుంచి రోడ్డు సమీపంలో క్రషర్ లోకి తరలించి 40ఎంఎం, 20ఎంఎం, 12ఎంఎం.. ఇలా వివిధ రకాల కంకరతో పాటు డస్ట్ గా మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
క్వారీలో నుంచి తరలించిన స్టాక్ కు.. క్రషర్ లోని స్టాక్ కు భారీ వ్యత్యాస ఉన్న విషయాన్ని ఇటీవల గనుల శాఖ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. 24,370 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన రోడ్డు మెటల్ వివరాలను క్రషర్ యూనిట్ నిర్వాహకులు రికార్డుల్లో నమోదు చేయకుండా.. ఎలాంటి సీనరేజీ చెల్లించకుండానే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ మెటల్ ను ఎక్కడికి తరలించారో తెలపాలంటూ నితిన్ కన్ స్ట్రక్షన్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటిపై కంపెనీ యాజమాన్యం ఏమాత్రమూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో క్రషర్ యూనిట్ సీజ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
గనుల శాఖ అధికారులు మాట్లాడుతూ.. నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్‌కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్‌లో రోడ్డు మెటల్‌కు సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని తెలిపారు. క్వారీ నుంచి వచ్చిన మెటల్‌కు, క్రషర్‌లో ఉన్న స్టాక్‌కు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో చెల్లించాలని నోటీసులు పంపినట్లు క్వారీల్లో అక్రమ తవ్వకాలు, క్రషింగ్ చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వారిని ఉపేక్షించమని అధికారులు హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.