Arjun Suravaram
Gudlavalleru College Principal Video: గుడ్లవల్లేరు కళాశాల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన అనేక కీలక మలుపు తీసుకుంది. ఇదే సమయంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ కు సంబంధించిన ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది.
Gudlavalleru College Principal Video: గుడ్లవల్లేరు కళాశాల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన అనేక కీలక మలుపు తీసుకుంది. ఇదే సమయంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ కు సంబంధించిన ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతుంది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు చేసిన ఆరోపణలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారంది. దీనిపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా ఆ కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడిని వీడియో సంచలనంగా మారింది. ఆవీడియోలో ప్రిన్సిపల్ పలు విషయాలను వెల్లడించారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ పాల్ రవీంద్ర బాబు.. అక్కడి విద్యార్థినులతో మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. అందులో ఈ సంఘటన గురించి ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. ఆ ప్రిన్సిపల్ మాట్లాడుతూ…మూడు రోజుల క్రితం ఫైనలియర్ చదువుతున్న భరత్ అనే విద్యార్థి తమ వద్దకు వచ్చాడని ప్రిన్సిపల్ తెలిపాడు. కాలేజీ అమ్మాయులకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూప్ లో పార్వార్డ్ అవుతున్నాయని, ఆ విద్యార్థి తమ దృష్టికి తెచ్చాడని తెలిపాడు. అయితే ఆ విద్యార్థి ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించామని, ఏదైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని తెలిపామన్నారు. అయితే తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని తెలిపాడని ప్రిన్సిపల్ చెప్పుకొచ్చాడు. సదరు విద్యార్థి అలా చెప్పడంతో తాము ఊపిరి పీల్చుకున్నామని తెలిపాడు. అయితే తాజాగా ఈ ఇష్యూ ఇంత పెద్దగా అవుతుందని తాము ఊహించలేదని, అందరు తమ బిడ్డలాంటి వారేనని చెప్పుకొచ్చాడు. అలానే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని విషయంలో కూడా కొన్ని విషయాలను వెల్లడించారు. ఆ విద్యార్థి తన ఫోను, తన ల్యాప్ టాప్ వంటి వస్తువులను ఎటువంటి పరీక్షలు నిర్వహించాడానికైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపాడు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఇష్యు ఏందనేది తెలియకుండానే పలువురు విద్యార్థునులు అనేక ఆరోపణలు చేశారని, నిజంగా ఇలాంటి వీడియోల ఘటన జరిగే ఉంటే ఆధారాలతో వస్తే.. ఎస్పీ స్థాయి వరకు తనకు నెట్ వర్క్ ఉందని హెల్ప్ చేస్తానంటూ ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నిజంగా ఫ్రూప్స్ ఉంటే.. తీసుకురావాలని, వారి సమాచారం గోప్యంగా ఉంచుతామాని, అయితే ఆ వీడియోలు రూట్ ద్వారా వచ్చాయనే విషయాన్ని మాత్రం తెలిసుకోవడంలో తాను సాయం చేస్తానని తెలిపాడు. ఇలా విద్యార్థినులతో గుడ్లవల్లేరు ప్రిన్సిపల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రిన్సిపల్ మాట్లాడుతున్న సమయంలో కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు విద్యార్థినులు గట్టిగా కేకలు వేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. మరి.. వైరల్ అవుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.