Arjun Suravaram
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదగనివ్వకుండా ఇద్దరు కట్టప్పలు పక్కనే ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆ ఇద్దరు కట్టప్పలు ఎవరు, వారు గతంలో చేసిన వెన్నుపోటు ఏమిటనేది కూడా మంత్రి వివరించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదగనివ్వకుండా ఇద్దరు కట్టప్పలు పక్కనే ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆ ఇద్దరు కట్టప్పలు ఎవరు, వారు గతంలో చేసిన వెన్నుపోటు ఏమిటనేది కూడా మంత్రి వివరించారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయలు చాలా విచిత్రంగా ఉంటాయి. నిత్యం ఇక్కడి రాజకీయాలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తాయి. ఇక వచ్చే ఎన్నికలల్లో జనసేన,టీడీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఇదే విషయాన్ని అధికార వైసీపీ ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. చంద్రబాబు పల్లకి మోసేందుకే పవన్ జనసేన పార్టీని స్థాపించారని అంటున్నారు. ఇక చంద్రబాబు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ బలికావాల్సిందే అంటూ జోష్యం కూడా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కి చిన్నకట్టప్ప, పెద్ద కట్టప్ప లు ఇద్దరు ఉన్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యనించారు. మరి.. మంత్రి దృష్టిలో పవన్ కల్యాణ్ ను వెన్నుపోటు పొడిచే ఆ ఇద్దరు కట్టప్పలు ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బహుబలి.. ఈ సినిమా గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి తెరక్కెకించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాలో కట్టప్ప అనే పాత్ర చాలా ఫేమస్. ఎంతలా అంటే.. నిజ జీవితంలో ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే.. నున్వు కట్టప్పవు రా.. అని సంబోధిస్తారు. అంతలా కట్టప్ప పేరు జనాల్లో నిలిచి పోయింది. రాజకీయాల్లో సైతం ఈ పేరును నేతలు ప్రస్తావిస్తూ ఉంటారు. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ పేర్లను ప్రస్తావించారు. ఒక్క కట్టప్పతోనే బాహుబలి అవుట్ అయ్యాడు.
జనసేన అధినేతకు ముందు ఒక కట్టప్ప వెనక ఒక కట్టప్ప ఉన్నారని తెలిపారు. వారే పెద్ద కట్టప్పగా నారా చంద్రబాబు, చిన్న కట్టప్పగా నాదెండ్ల మనోహర్ అని వైసీపీ మంత్రి అమర్నాథ్ జనసేన రాజకీయ సినిమా భవిష్యత్తు చిత్రం చూపించారు. సొంత మామ అని చూడకుండా సీనియర్ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన పెద్ద కట్టప్ప చంద్రబాబు నాయుడు, అలానే బాబు కంటే ముందు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు నాదెండ్ల మనోహర్ చిన్న కట్టప్ప అని మంత్రి అంటున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ ను చిన్న కట్టప్ప మనోహర్ ఇప్పటికే తప్పుదోవలో నడిపిస్తూ వచ్చారని, ఇప్పుడు ప్రజలను అదే దారిలో పెట్టేందుకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టుని చదువుతున్నారని మంత్రి విమర్శించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురద జల్లేందుకు నాదెండ్ల తన మేధావితనాన్ని ఉపయోగిస్తున్నారని మంత్రి విరుచుకుపడ్డారు. అబద్ధం లేని ఉన్నట్లుగా చూపించడం ద్వార నాదెండ్ల వైసీపీ ప్రభుత్వాన్ని పలుచన చేయాలనుకుంటే కుదరదు అని గుడివాడ పేర్కొన్నారు.
మనోహర్ రక్తంలోనే వెన్నుపోటు తత్వం ఉందని కూడా దుయ్యబట్టారు. ఏదో విమర్శ చేయాలని ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఇద్దరు కట్టప్పలు చాలని పవన్ కల్యాణ్ ని రాజకీయంగా ఎదగనీయకుండా చేయడానికి ఇలా ఇద్దరు కట్టప్పలు చాలని అమర్నాథ్ సెటైర్లు వేశారు. మరి.. చంద్రబాబును, మనోహర్లను మంత్రి అమర్నాథ్ కట్టప్పలతో పోల్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.