Arjun Suravaram
Gorantla Butchaiah Chowdary: టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని టాక్ వినిపిస్తోంది.
Gorantla Butchaiah Chowdary: టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే 2019 ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సృష్టించిన ప్రభజనం అంతాఇంతా కాదు. 175 స్థానాలకు గాను 151 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. టీడీపీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఇంతటి ఘోర పరాభవం ఎప్పుడు జరగలేదు. అయితే జగన్ ఫ్యాన్ గాలిని తట్టుకుని కొందరు టీడీపీ నేతల విజయం సాధించారు. అలాంటి స్థానాల్లో రాజమండ్రి రూరల్ సీటు ఒకటి. ఇక్కడి నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. అంతటి జగన్ హవాలోనే గెలిచిన బుచ్చయ్యకు ఈ సారి టికెట్ దక్కేలా కనిపించడం లేదు. అందుకు ఒక బలమైన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గాలో రాజమండ్రి రూరల్ ఒకటి. ఈ అసెంబ్లీ నియోజవర్గం టీడీపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత..ఇక్కడ ఒక్కసారి కూడా సైకిల్ పార్టీ పడిపోలేదు. ఇప్పటివరకు మూడు ఎన్నికలు జరిగితే.. అన్నిసార్లు టీడీపీ జెండానే ఎగిరింది. ఇక్కడి నుంచి 2014, 2019 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కనిపించిన ఎన్నికల్లో 10వేలకు పైగా ఓట్ల మెజారిటీ రావడం అంటే మాములు విషయం కాదు. ఇలాంటి స్థానాన్ని టీడీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా రాజమండ్రి గ్రామీణ స్థానంపై జనసేన కర్చీఫ్ వేసింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్.. ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖరారైంది.
రాజమండ్రి రూరల్ సీటు విషయంలో ఇక్కడే ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వస్తుంది. చంద్రబాబుకు తెలియకుండానే, ఆయన అనుమతి లేకుండానే జనసేన అభ్యర్థిని ప్రకటిస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అలానే చంద్రబాబు అండతోనే జనసేన తమ అభ్యర్థిని పరోక్షంగా ప్రకటించిందనే వార్తలు వినిపిస్తోన్నాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఉన్న కోపంతోనే చంద్రబాబు అలా చేశారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మీద కక్షతోనే పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు దక్కకుండా చంద్రబాబు స్కేచ్ వేసినట్లు ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. గతంలో తారక్ ను ఉద్దేశిస్తూ బుచ్చయ్య చౌదరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ పుంజుకునే అవకాశాలు లేవు అంటూ గోరంట్ల వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఎన్టీఆర్‌ను ఆహ్వానించాలని కూడా బుచ్చయ్య చౌదరి బాబుకు సూచించారు.
ఇదే మనస్సులో పెట్టుకున్న బాబు కంచుకోట అని తెలిసినా.. రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేనకు అప్పగించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ఇక అటు లోకేశ్‌కు, బుచ్చయ్య చౌదరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయన్నది పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్. ఇది కూడా బుచ్చయ్య సీటుకు ఎసరు పెట్టడానకి మరో కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. టీడీపీ సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ పక్కనే ఉన్నారు. ఆ కారణంతోనే ఇప్పటి వరకు బుచ్చయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదనేది చాలా మంది చెప్పే మాట. తాజాగా తారక్ పై ఉన్న కోపంతోనే ఏకంగా ఆయన సీటుకు ఎసరు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రాజమండ్రి రూరల్ సీటు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.