తిరుమల భక్తులకు శుభవార్త..వారికి ఆన్‌లైన్‌లో బుకింగ్ సౌకర్యం!

తిరుమల తిరుపతికి దేశ నలుమూలల నుంచి నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే చాలా మంది స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. తాజాగా టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది.

తిరుమల తిరుపతికి దేశ నలుమూలల నుంచి నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే చాలా మంది స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. తాజాగా టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది.

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక భక్తుల సౌకర్యార్థం టీటీడీ సైతం అనేక చర్యలు తీసుకుంటుంది.  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనేక రకాల సదుపాయనలు కల్పిస్తుంది. అంతేకాక దర్శనం,  ఇతర స్వామి వారి సేవలకు సంబంధించిన బుకింగ్ వంటి విషయాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా  చూస్తున్నారు. ఇదే సమయంలో శ్రీవారి భక్తులకు తరచూ గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా టీటీడీ మరో శుభవార్త చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తిరుమల తిరుపతికి దేశ నలుమూలల నుంచి నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే చాలా మంది స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. అలానే మరికొందరు స్వామిరి సేవకులుగా ఉండేందుకు తిరుమలకు వస్తుంటారు. స్వామి వారికి సేవలు చేయడానికి వచ్చే వారు ముందుగానే టీటీడీ వద్ద బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలాంటి వారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారికి సేవ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని భక్తులకు ఇచ్చింది. అంతేకాదు, సామాన్య భక్తులు కూడా శ్రీవారికి సేవ చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పింది. సామాన్య భక్తులు సైతం శ్రీవారి సేవకులుగా మారేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి సేవకు సంబంధించి ఆన్‌లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ కోటాను గురువారం నాడు  ఆన్‌లైన్‌లో రిలీజ్  చేయనున్నారు. స్వామి వారి సేవ కోటాను రేపు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వీటితో పాటు నవనీత సేవకు సంబంధించిన టికెట్లను కూడా మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. పరకామణి సేవ గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో  రిలీజ్ చేయనున్నారు.

తిరుమల శ్రీవారితో పాటు ఆ పరిసరాల్లో ఉన్నా టీటీడీ ఆలయాల్లో కూడా శ్రీవారి సేవకులు వారి సేవలను అందిస్తున్నారు. అయితే ఇలా స్వామివారి సేవలకు వచ్చే వారికి తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. స్వామివారి సేవకు వచ్చే పురుషులు తెలుపు రంగు వస్త్రాలను, మహిళలు కాషాయం రంగు చీర ధరించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ సేవలను కూడా ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. మరి.. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

Show comments