iDreamPost
android-app
ios-app

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్

జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత.. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి.. నిరుద్యోగులను ఉపాధి కల్పించారు. ఇప్పుడు మరోసారి నిరుద్యోగులకు శుభవార్త వెల్లడించింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత.. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి.. నిరుద్యోగులను ఉపాధి కల్పించారు. ఇప్పుడు మరోసారి నిరుద్యోగులకు శుభవార్త వెల్లడించింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు, పిన్నలు. ఆయన ప్రభుత్వంలో తీసుకు వచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను పలువురు మాజీ ఐపీఎస్ అధికారులు సైతం మెచ్చుకుంటున్నారు. పలు ప్రభుత్వాలు సైతం.. జగన్ పాలనా విధానాలను అనుసరిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతున్నారు. ఇదిలా ఉంటే ఎటువంటి పక్షపాతానికి తావునివ్వకుండా.. నేరుగా ప్రజలకు లబ్ది చేకూరే విధంగా పథకాలను అమలు చేస్తున్నారు ఏపీలోని అధికారులు . తొలిసారి ముఖ్యమంత్రి హోదాను చేపట్టాక.. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు మరోసారి నిరుద్యోగులకు శుభవార్త వెల్లడించారు వైఎస్ జగన్.

ఏపీ నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటీఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మొత్తం 3,220 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. సుమారు 17 సంవత్సరాల తర్వాత.. జగన్ హయాంలో ఈ యూనివర్శిటీల్లో ఖాళీలను పూర్తి చేయడం గమనార్హం. ఇందులో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఒకే ఫీజుతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అన్ని వర్సీటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి ఉమ్మడి పోర్టల్‌లో నేటి నుండి ఆన్ లైన్‍లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ,ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 2500 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీబీడీ క్యాండిడేట్లకు రూ. 2వేలు, ఎన్ఆర్ఐలకు రూ. 4200 గా ఫీజలు నిర్ణయించింది. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు.. ఏ కేటగిరీ అభ్యర్థులు అయినా.. 3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలకు రూ. 12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ. 8400 చెల్లించాల్సి ఉంది. దరఖాస్తులకు చివరి తేదీ.. నవంబర్ 27. ఫీజు చెల్లింపు చివరి తేదీ.. నవంబర్ 20. దీనికి ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.