P Krishna
ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తన వంతు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తన వంతు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
P Krishna
ఈ నెల 30 న తెలంగాణలో ఎన్నికల జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీలో ఏర్పడిన సంక్షోభం గురించి ఏపీలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ది.. సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు అధికార పార్టీ నేతలు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమం చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో తమకు మరో ఛాన్స్ ఇప్పిస్తే ఏపీని మరింత అభివృద్ది పథంలోకి తీసుకువెళ్తామని హామీ ఇస్తున్నారు. సీఎం జగన్ పలు జిల్లాలు పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు కృషి చేస్తున్నారు. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డుదారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో కంది పప్పు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. నాలుగు నెలలుగా సరుకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే సరఫరా చేస్తుండగా.. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సాధారణంగా ఇంట్లో వంటకాల్లో ఎక్కువగా కందిపప్పును వినియోగిస్తుంటారు. ఇది దృష్టిలో పెట్టుకొని రేషన్ ద్వారా కందిపప్పు అందించేందుకు సిద్దమయ్యారు. భవిష్యత్ లో కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా స్థానిక రైతుల వద్ద కందులు కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో ప్రాసెసింగ్ చేసి, రేషన్ ద్వారా కేజీ రూ.67 కే అందించనుంది.
ఏపీలో కందిపప్పు గత నాలుగు నెలలుగా అందుబాటులో లేకపోవడంతో కొన్నిచోట్ల మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులకు ఇబ్బంది లేకుండా డిసెంబర్ నెం నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు పంపిణీ చేయడానికి సిద్దమైంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని.. రేషన్ తీసుకునే వారి శాతం 90 కి పైగానే ఉందని అంటున్నారు. ఇక రేషన్ షాపుల్లో లభిస్తున్న ఫోర్డిఫైడ్ బియ్యం మార్కెట్ లో దొరుకుతున్న సన్నబియ్యం లాగే ఉండటంతో ప్రజలు వాటినే ఎక్కువగా ఆహారంగా వినియోగిస్తున్నారు. గత మూడు నెలల నుంచి ప్రభుతవ్ం ఫోర్టిపైడ్ గోధుమ పిండిని రూ.16 కే సరఫరా చేస్తుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటీవ్ అసోసియేషన్ ద్వారా పౌరసరఫరాల శాఖ దాదాపు పదివేల టన్నుల కందిపప్పు కోనుగోలుకు ఆర్టర్ సైతం ఇచ్చింది. మొత్తానికి రేషన్ వినియోగదారులు ఈ శుభవార్తలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.