P Krishna
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాము చేసిన అభివృద్ది పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాము చేసిన అభివృద్ది పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
P Krishna
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలన కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ ప్రజలకు ఎంతో చేరువయ్యారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారు. త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల మద్దతు కోసం తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
2022, మే 24న అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనలకు సంబంధించిన ఆరు కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయా కేసుల్లో నిందితులపై విచారణను ఉపసంహరించుకుంది. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022వ సంవత్సరం మే నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పేరు మార్చడంపై కోనసీమలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అమలాపురంలో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగులబెట్టారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయడానికి వెళ్తే కొంతమంది రాళ్లు విసిరారు. దీంతో జిల్లా ఎస్పీ సహా.. వంద మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే అమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వందమందిపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి.
అమలాపురం పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 138/2022, 139/2022, 140/2022, 141/2022, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 126/2022, 127/2022 కేసులు నమోదు కాగా.. వాటిని ఎత్తి వేస్తున్నట్లు డిసెంబర్ 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆదివారం తెలిసిందే. కాగా, కోనసీమ జిల్లాకు డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గా పేరు మార్చవద్దని తలపెట్టిన ‘చలో అమలాపురం’ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాలకు దారి తీసింది.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. తాజాగా ఆందోళన కారులపై కేసులు ఎత్తివేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపలో తెలియజేయండి.