Krishna Kowshik
గుడికి ఎందుకు వెళతారు. . మన కోరికలు తీర్చమని, శ్రద్దగా దేవుడికి/దేవతకు మొక్కుతారు. అంతే కానీ గుడిలోకి వచ్చి పాడు పని చేస్తారా..?
గుడికి ఎందుకు వెళతారు. . మన కోరికలు తీర్చమని, శ్రద్దగా దేవుడికి/దేవతకు మొక్కుతారు. అంతే కానీ గుడిలోకి వచ్చి పాడు పని చేస్తారా..?
Krishna Kowshik
ఇంటికి, బ్యాంకులకు కన్నాలు వేసే దొంగలు కొందరు అయితే.. సెల్ ఫోన్ టవర్స్, బస్సులు, రైలు బ్రిడ్జీలు, రైలు పట్టాలు దొంగిలించే వారు మరికొందరు. అలాగే సెల్ ఫోన్ దొంగలు, మెడలో చైన్స్ లాక్కెల్లే చైన్స్ స్నాచర్ గురించి కూడా విన్నాం. ఈ ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్లు.. చివరకు ఆర్థిక నేరగాళ్ల గురించి కూడా తెలుసు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ మాత్రం..మామూలోడు కాదు.. మహా ముదురు. భక్తుడి ముసుగులో అమ్మకే పంగనామాలు పెట్టాడు. గుడిలోకి వచ్చి పాడు పనులు చేశాడు. అతడు చేసిన ఘనకార్యం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఇంతకు అతడు చేసిన పనేంటో తెలుసా..?
అమ్మవారి మెడలో ఉన్న మంగళ సూత్రాన్నే చోరీ చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఏలూరు సత్రంపాడులో సౌభాగ్య లక్ష్మి ఆలయం ఉంది. ఆ గుడికి భక్తుడి రూపంలో వచ్చాడు వ్యక్తి. చాలా భక్తిగా దేవతకు దణ్ణం పెట్టుకున్నాడు. ఆ తర్వాత వెనకా ముందు చూశాడు.. వెంటనే ఆలయం గర్భ గుడిలోకి వెళ్లి.. అమ్మవారి మెడలో ఉన్న బంగారు తాడును కొట్టేసి.. దానిని జేబులో వేసుకుని పరారయ్యాడు. చూడటానికి దర్జాగా, పెద్ద మనిషిగా కనిపిస్తున్న అతడు దొంగ అంటే నమ్మలేని విదంగా ఉన్నాడు. మొహనికి మాస్కు వేసుకున్నాడు. అంటే దొంగతనం చేసే ఉద్దేశంతోనే అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఈ ఘటన సీసీటీవీ రికార్డుల్లో నమోదైంది. మరీ దీనిపై కేసు నమోదైందో లేదో తెలియరాలేదు. దర్శనం కోసం గుడిలోకి వచ్చిన వ్యక్తి దర్జాగా అమ్మవారి మెడలో బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఆ సమయంలో భక్తులు కానీ పూజారి కానీ లేనట్లుగా కనిపిస్తుంది. ఇదే అదునుగా చూసి అతడు దొంగతనానికి పాల్పడ్డాడని సీసీటీవీ వీడియోను బట్టి అర్థమౌతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఛీ, ఘోరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుడికి వెళ్లి గుడిలోని లింగానికి ఎసరు పెట్టాడు ఈ మహానుభావుడు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వీడికి భయం లేదు.. భక్తి లేదు…
అమ్మవారి మెడలో మంగళసూత్రం చోరీఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో చోరీ జరిగింది. దర్శనం కోసం గుడిలోకి వచ్చిన వ్యక్తి.. అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిపోయాడు.#AndhraPradesh #eluru #ammavaritemple #theft #NewsUpdate… pic.twitter.com/hiyZxFnaih
— BIG TV Breaking News (@bigtvtelugu) April 7, 2024