iDreamPost

CM జగన్‌ను కలిసిన గౌతమ్‌ అదానీ.. ఆ రెండు ప్రాజెక్ట్‌లపై కీలక చర్చ

  • Published Sep 29, 2023 | 7:53 AMUpdated Sep 29, 2023 | 7:53 AM
  • Published Sep 29, 2023 | 7:53 AMUpdated Sep 29, 2023 | 7:53 AM
CM జగన్‌ను కలిసిన గౌతమ్‌ అదానీ.. ఆ రెండు ప్రాజెక్ట్‌లపై కీలక చర్చ

అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ గురువారం సాయంత్రం.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో.. జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టుకు సంబంధించి.. వివిధ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు అదానీ. ఇక ఈ భేటీలో.. ఇరువురి మధ్య రాష్ట్రంలో అదానీ కంపెనీ పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జగన్‌తో భేటీ, ఆయనతో చర్చించిన అంశాల గురించి అదానీ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా అదానీ..‘‘గౌరవ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశం ఎప్పటికి సంతృప్తికరంగానే ఉంటుంది. ఈ సమావేశం సందర్భంగా ఏపీలోని అదానీ కంపెనీకి సంబంధించి ముఖ్య ప్రాజెక్ట్‌ల గురించి చర్చించాము. అనగా గన్నవరం పోర్ట్‌, వైజాగ్‌ డాటా సెంటర్‌. ఈ రెండు ప్రాజెక్ట్‌లు ఏపీకి ఎంతో ముఖ్యమైనవని మేం భావిస్తున్నాము’’ అంటూ ట్వీట్‌ చేశారు.

విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే సీఎం జగన్‌.. ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 14,000 కోట్ల రూపాయలతో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చేపట్టిన భారీ ప్రాజెక్ట్ ఇది. దీన్ని రానున్న ఏడు సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ డేటా సెంటర్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. 24,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ ను నెలకొల్పడానికి జగన్ ప్రభుత్వం 2021లో విశాఖపట్నంలో 130 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి