వరద బాధితుల కోసం గొప్ప మనసు చాటుకుంటున్న మెకానిక్!

Andhra Pradesh Floods: ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు బెజవాడ వణికిపోయింది. బుడమేరు వాగు పొంగిపొర్లడంతో ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇప్పటికీ అక్కడ ప్రజలు తేరుకోలేకపోతున్నారు. అలాంటి వారికి దాతలు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

Andhra Pradesh Floods: ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు బెజవాడ వణికిపోయింది. బుడమేరు వాగు పొంగిపొర్లడంతో ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇప్పటికీ అక్కడ ప్రజలు తేరుకోలేకపోతున్నారు. అలాంటి వారికి దాతలు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఏపీలో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. బుడమేరు వాగు పొంగి పొర్లడంతో పలు కాలనీలో నీట మునిగిపోయాయి.దీంతో ఇండ్లల్లోకి వచ్చిన వర్షపు నీటితో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కొంతమంది ప్రాణ భయంతో ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. బోట్ల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడారు రెస్క్యూ టీమ్. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో తిరిగి తమ ఇండ్లకు వెళ్తున్నారు.వర్షాలతో ఇండ్లల్లో సామాన్లు బురతతో పూర్తిగా పాడైపోయాయి.ఈ సమయంలో ఓ మెకానిక్ తన మంచి మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే వర్ష ప్రభావం ఎక్కువగా విజయవాడపై కనిపిస్తుంది. విజయవాడలో బుడమేరు వాగు బీభత్సం సృష్టించింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బుడమేరు వాగు దెబ్బకు ఇళ్ళు, షాపులు, వాహనాలు మొత్తం నీట మునిగిపోయాయి. కొన్ని విలువైన వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. టీవీలు, వాషింగ్ మెషన్లు, ఫ్రిజ్, ఏసీలు, గ్యాస్ స్టవ్ బురదతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కష్టకాలంలో విజయవాడ వరద బాధితులకు సాయంగా ఎంతోమంది నిలుస్తున్నారు. తమకు తోచిన సాయం అందిస్తున్నారు.. భోజనం, దుస్తులు, నిత్యావసర సరుకులు ఇలా ఎన్నో రకాలుగా ప్రజలను ఆదుకుంటున్నారు.

విజయవాడ వరద బాధితుల కోసం గ్యాస్ స్టవ్ లు రిపేరు చేసే ఓ మెకానిక్ తన మంచి మనసు చాటుకున్నారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఓ గ్యాస్ స్టవ్ మెకానిక్ ఇటీవల వర్షాల కారణంగా ఇండ్లల్లో వర్షపు నీటితో పాడైన గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా రిపేరు చేస్తామని ఓ ఫ్లేక్సీ ఏర్పాటు చేశాడు. అవసరమైన వారు గ్యాస్ స్టవ్ తన వద్దకు తీసుకువస్తే ఉచితంగా రిపేర్ చేసి ఇస్తానని ప్రకటించాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకు వచ్చిన వృత్తిని ఈ సమయంలో స్వార్ధానికి ఉపయోగించకుండా పదిమంది మేలు కోరి సాయంగా ఉంటానని చెప్పడం నిజంగా ప్రశంసనీయం అంటున్నారు.. ఇది కదా మానవత్వం అంటే ’ అంటూ ఆ మెకానిక్ ని అభినందిస్తున్నారు నెటిజన్లు.

Show comments