Arjun Suravaram
తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలులోకి వచ్చింది. తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన వారికి కేవలం రూ. 500కే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. అయితే ఏపీలో కూడా రూ.500 బడ్జెట్‌లోనే సిలిండర్ పొందొచ్చు. ఎలా అంటే...
తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలులోకి వచ్చింది. తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన వారికి కేవలం రూ. 500కే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. అయితే ఏపీలో కూడా రూ.500 బడ్జెట్‌లోనే సిలిండర్ పొందొచ్చు. ఎలా అంటే...
Arjun Suravaram
ప్రస్తుతం నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో వాడే గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లడిపోతున్నాడు. గ్యాస్ బండ..మధ్యతరగతి వాడికి గుదిబండగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. రూ.500లకే గ్యాస్ అందించేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇక అదే విధంగా ఏపీలో అమలు అయితే బాగుండని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పని పడ్డాయి. ఈ క్రమంలోనే సామాన్యుడికి గుది బండగా మారిన సిలిండర్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. రూ.400 మేర గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడంతో ద్వారా తగ్గింపు బెనిఫిట్స్ పొందవచ్చు. అలానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల్ స్కీమ్ లబ్ధిదారులకు కూడా భారీ డిస్కౌంటే లభించింది. ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న వాళ్లకు రూ.560 కే గ్యాస్ బండను పొందవచ్చు.
ఎలాంటి స్కీమ్ ఆధారంలేకుండానే ఉజ్వల్ స్కీమ్ కింద దరఖాస్తు చసుకున్న వాళ్లకు బెనిఫిస్ట్ లభఇస్తాయి. అయితే ఈ స్కీమ్ కింద లేని ప్రజలకు మాత్రం 860 రూపాయలకు సిలిండర్ లభిస్తుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లేని వాళ్లు ఉజ్వల స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఏపీలో కూడా ఈ స్కీమ్ కింద అర్హులైన వారు 500లకే గ్యాస్ సిలిండర్ పొందవచ్చని తెలుస్తోంది. అయితే దీని బీపీఎల్ కింద ఉన్నవారే అర్హులు. అంతేకాక ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మొత్తంగా త్వరలో ఏపీలో కూడా రూ.500లకే గ్యాస్ సిలిండర్ లభించనున్నట్లు తెలుస్తోంది. మీరు ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్ పొంది ఉంటే.. అప్పుడు మీకు మరింత తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
ఇలా సబ్సిడీ, తాజా తగ్గింపు కలుపుకుంటే వీరికి భారీగా లాభం ఉందని చెప్పుకోవచ్చు. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఏకంగా రూ. 300 తగ్గింపు ఉన్న విషయం తెలిసేందే. అంటే ఈ స్కీమ్ కింద సిలిండర్ పొందిన వారు బుక్ చేసుకుంటే తిరిగి రూ. 300 బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చి చేరుతుంది. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కేవలం రూ. 560కే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వచ్చే ఏడాది మార్చి చివరి వరకు సబ్సిడీ అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.