iDreamPost
android-app
ios-app

రైల్వే ప్రయాణికులకి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ ట్రైన్ లో జర్నీ సూపర్!

Garibhrath Coaches: ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే భద్రతను పెంపొందించే లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Garibhrath Coaches: ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే భద్రతను పెంపొందించే లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

రైల్వే ప్రయాణికులకి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ ట్రైన్ లో జర్నీ సూపర్!

భారత దేశంలో ఉన్న అతి ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల్లో రైల్వే ప్రధానమైనది. ఇది అందించే సేవల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇక రైళ్ల ద్వారా నిత్యం ఎంతో మంది ప్రయాణం చేస్తుంటారు. టికెట్ ధర తక్కువ ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే భద్రతను పెంపొందించే లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.  గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో జర్నీ చేసే వారికి సూపర్ న్యూస్ ను అందించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

రైల్వే ప్రయాణికుల సౌకర్యం, రక్షణ, భద్రతను పెంపొదించే లక్ష్యంతో ఇండియన్ రైల్వే  గరీబ్ రథ ఎక్స్ ప్రెస్ ను ఆధునిక లింక్ హాఫ్ మన్ బుష్ కోచ్ లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయంపై వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ అధికారి కె. సందీప్ కీలక విషయాలను వెల్లడించారు. జులై 22 నుంచి ఈ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ – విశాఖ పట్నంకి నడిచే గరీబ్ ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్ ( 12740)  రైలు 2024 జులై 22 నుండి అమలులోకి వచ్చేలా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్ ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్ (12739)  రైలు 2024 జులై 23 నుండి అందుబాటులోకి వచ్చేలా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో మార్చ‌నున్నారు.

ఇండియ‌న్‌ రైల్వే తన రోలింగ్ స్టాక్‌ను ఆధునీకరించడానికి,  ప్యాసింజర్లకు మరింత సౌకర్యవంతమైన, భద్రతపరమైన ప్రయాణాన్ని అందించడానికి చేసే ప్రయత్నాలలో భాగమ‌ని  రైల్వే అధికారులు తెలిపారు. కొత్త రేక్‌లో 18 ఎసీ ఎకానమీ కోచ్‌లు, రెండు జనరేటర్ మోటార్ కార్లతో కలిసి మొత్తం 20 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కారణంగా ఎంతో సుఖవంతమైన  ప్రయాణ సౌకర్యం, మెరుగైన భద్రతా ఫీచర్‌లు ప్రయాణ సమయం త‌గ్గుద‌ల‌కు తోడ్పడుతాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రైళ్ల‌కు పాత మోడ‌ల్ బోగిలే ఉన్నాయి. దీంతో ఈ రైళ్ల‌లోని బోగీల్లో అప్‌గ్రేడ్ చేయాల‌ని రైల్వే శాఖ నిర్ణ‌యించింది. అందులో భాగంగానే ఆధునిక లింకే హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లుగా మార్చనున్నారు. గరీబ్ ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడ‌, అన‌కాప‌ల్లి, తుని, సామర్ల‌కోట‌, రాజ‌మండ్రి, ఏలూరు, విజ‌య‌వాడ‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతుంది.

తొలిసారి 2016 విశాఖ డిల్లీ మధ్య ఈ ఎల్ హెచ్ బి బోగీలను నడిపారు. తాజాగా గరీభ్ రథ ట్రైన్ లో  ఏర్పాటు చేయనున్నారు. జర్మన్ టెక్నాలజీతో ఈ ఎల్ హెచ్ బీ వ్యవస్థ పని చేస్తోంది. దీని ద్వారా  ఏదైనా ప్రమాదాం జరిగినప్పుడు ఒక భోగిని మరోక భోగి ఢీకొట్టదు. ఈ ఎల్ హెచ్ బీ భోగీల్లో కుదుపుల్లోని ప్రయాణం ఆస్వాదించ వచ్చు. తక్కువ బరువుతో పాటు భద్రతా ప్రమాణాలతో ఈ ఎల్ హెచ్ బి వ్యవస్థ రూపకల్పన జరిగింది. మూములు వాటి కంటే ఇవి రెండు మీటర్లు పొడవుగా ఉంటాయి. మిగిలిన వాటితో పోలీస్తే వీటిల్లో సీట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మొత్తంగా ఈ ట్రైన్ లో ఎక్కువగా జర్నీ చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి