Arjun Suravaram
Uddanam, YS Jagan: ఆంధ్రప్రదే రాష్ట్రంలోని ఉద్దానం ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పేరు వినగానే కిడ్నీ సమస్యతో బాధపడే ప్రజలే కనిపిస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం దాదాపు 40 ఏళ్ల ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల కలను సీఎం జగన్ సాకారం చేశారు.
Uddanam, YS Jagan: ఆంధ్రప్రదే రాష్ట్రంలోని ఉద్దానం ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పేరు వినగానే కిడ్నీ సమస్యతో బాధపడే ప్రజలే కనిపిస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం దాదాపు 40 ఏళ్ల ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల కలను సీఎం జగన్ సాకారం చేశారు.
Arjun Suravaram
ఉద్దానం అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది కిడ్నీ సమస్యలతో బాధపడే బాధితులే. ఇక ఈ సమస్య అనేది ఈ రోజుది కాదు.. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్యతో ఈ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. దాదాపు 40 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారుతున్నా.. కొత్త పాలకులు వస్తున్నా..వారి సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. ఇక తమ బతుకులు ఇంతేలే అని తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇలా ఏళ్ల తరబడి సమస్యతో బాధపడుతున్న ఉద్దానం బాధితుల సమస్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చారు. గురువారం ఆ ప్రాంతంలో వైఎస్సాఆర్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టని సీఎం జగన్ ప్రారంభించారు. 40 ఏళ్లుగా ఏ సీఎం చేయని పనిని కేవలం రెండేళ్లలోనే సీఎం జగన్ ఉద్దానం సమస్యను తీర్చారు. అసలు ఉద్దానం సమస్య ఏమిటి?. అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉద్దానం.. అంటే ఉద్యాన వనం అని చాలా మంది అంటుంటారు. ఆ పేరుకు తగినట్లుగానే ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు కొబ్బరి, జీడి మామిడి, పనస, మామిడి తోటలు ఉన్నాయి. ఇంకోవైపు నాగావళి, వంశధార, మహేంద్రతనయ వంటి జీవ నదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉంది. అందుకే ఈ ప్రాంతానికి ఉద్దానం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఇలాంటి పచ్చని ఉద్దానం ప్రాంతంలోని ప్రజలు మాత్రం ఓ సమస్య వెంటాడుతూనే ఉంది. కిడ్నీ వ్యాధులతో ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారు. అంతుపట్టని సమస్యలతో స్థానికులు అల్లాడుతున్నారు. ముఖ్యంగా సోంపేట, కవిటి, కుసుంపురం, కళింగ పట్నం ప్రాంతంలో ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల కారణంగా అక్కడి వారు ఆర్థికంగా చితికి పోయారు.
పేదరికం కారణంగా కొందరు ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ గుర్తించినప్పటికీ నాటు వైద్యుల వద్దకు వెళ్లి, తాత్కాలికంగా నొప్పి నివారణకు మందులు వేసుకోవడంతో ఈ జబ్బు మరింత తీవ్రమైపోతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ కిడ్నీ సమస్యలతో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధికి గురైన వారిలో మొదటి దశలో 35 నుంచి 50 శాతం కిడ్నీలు పాడవుతాయి. తర్వాత 80 శాతం వరకు, మూడో దశలో 80 శాతం కంటే ఎక్కువ కిడ్నీలు పని చేయడం మానేస్తాయి. దాంతో వీరికి డయాలసిస్ అవసరమవుతుంది.
ఈ వ్యాధికి కారణం ఆ ప్రాంతంలో తాగే నీరు. కవిటి మండలం కుసుంపురం గ్రామం కొబ్బరి, జీడిమామిడి తోటలతో పచ్చగా కనిపిస్తుంది. కానీ ఇక్కడి ప్రజల్లో మాత్రం జీవం కనిపించదు. ఈ కిడ్నీ సమస్యలపై పర్యావరణ వేతలు కీలకాంశాలను వివరించారు. ఉద్దానంలో కిడ్నీసమస్యలకు కారణమని భావిస్తున్న భార లోహాలు, జెనిటిక్స్, సముద్రతీర ప్రాంతం వంటి అంశాలపై పరిశోధన చేశారు. వ్యవసాయంలో అధికంగా వినియోగిస్తున్న రసాయన ఎరువులే, భూగర్భ జలంలోని ఫ్లోరైడ్ వంటి వాటి కారణంగానే ఈ కిడ్నీ సమస్యలు వస్తున్నాయి.
ఈ ప్రాంతంలో పలు ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేసి.. సంచలన విషయాలు తెలిపాయి. సాధారణంగా రక్తంలో సిరం క్రియాటినిన్ 1.2 మి.గ్రా /డె.లీ కంటే ఎక్కువగా ఉంటే… మూత్రపిండాలు సరిగా పని చేయడంలేదని అర్థం. అదే ఉద్దానం ప్రాంతంలో ప్రజల్లోని చాలామందిలో సీరం క్రియాటినిన్ లెవెల్స్ 25 మి. గ్రా/డె.లీ కూడా ఉన్నాయి. క్రియాటినిన్ 5 దాటితే వారికి డయాలసిస్ తప్పనిసరి. అలాంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.
ఆ ప్రాంతంలో వచ్చే నీరు తాగితే ప్రాణాలు పోతాయని తెలిసి కూడ.. గత్యంతరం లేకా.. అదే నీటిని తాగుతున్నారు. అలా ఏళ్ల తరబడి..ప్రాణాల కోసం ప్రాణాలు పోయే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది తప్పు అని తెలిసినా..తప్పక చేయాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పే వారేతప్ప.. ఆ దిశగా పనులు చేసిన వారే లేరని ఉద్దానం బాధితులు ఆవేదన చెందారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నారు. కానీ తమ రాతలు మారడం లేదని కన్నీరు పెడుతున్నారు.
ఇలా దాదాపు 40 ఏళ్ల పాటు నరకం అనుభవిస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిలా కనిపించారు. 40 ఏళ్లుగా ఎవరు చేయలేని పనిని కేవలం రెండేళ్లలోనే వారి కలలను సాకారం చేశారని ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ నేడు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం గ్రామానికి సందర్శించారు. అక్కడ నిర్మించిన వైఎస్సార్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుని ప్రారంభించారు. జలజీవన్ మిషన్ లో భాగంగా ఏప్రిల్ 2020లో 700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తై సురక్షిత నీటిని ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది.
హిరమండలం వంశధార రిజర్వాయర్ నుంచి 100 కిలోమీటర్లుకు పైగా ప్రయాణించి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు తీవ్రంగా ఉన్న 807 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు. ఈ ప్రాజెక్టు జనవరి 30వ తేదీకి పూర్తవుతుందని గతంలో ఒప్పందం కుదుర్చుకున్న మేఘా సంస్థ ప్రకటించింది. అయితే అనుకున్న సమయానికి ముందుగానే చాలా రోజుల ముందే పూర్తికావడం విశేషం. 807కు 613 గ్రామాలలో 100శాతం పనులు పూర్తయ్యాయి. ఇందులో 537 శివారు గ్రామాలకు నీరు చేరనుంది. మిగిలిన 270 గ్రామాలకు ఈనెల 31లోగా సురక్షిత తాగునీరు అందుతుంది.
ఇక సీఎం శ్రీకాకుళం పర్యటనలో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు సీఎం జగన్ శంకుస్థాపన్ చేశారు. అలానే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి భవనాన్ని వర్చుల్ పద్ధతిలో ప్రారంభించారు. ఉద్దానం ప్రాంతంలో కళ్ల ముందే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి సాహసించలేదు. అలాంటి పరిస్థితిలో జగన్ ప్రభుత్వం రూ.785 కోట్ల భారీ వ్యయం చేసీ మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఈ సమగ్ర సురక్షిత మంచినీటి పథకాన్ని సీఎం జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావడంతో ఉద్దానం వాసుల చిరకాల స్వప్నం ఫలించినట్లైంది.