Arjun Suravaram
మన దేశంలో ప్రధానమైన రవాణ వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే వివిధ పనుల నిమిత్తం తరచూ పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తుంటారు. తాజాగా ఏపీ ప్రయాణికులకు రైల్వే అధికారుల ముఖ్య గమనిక.
మన దేశంలో ప్రధానమైన రవాణ వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే వివిధ పనుల నిమిత్తం తరచూ పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తుంటారు. తాజాగా ఏపీ ప్రయాణికులకు రైల్వే అధికారుల ముఖ్య గమనిక.
Arjun Suravaram
మన దేశంలో ఉన్న రవాణా వ్యవస్థలో రైల్వే శాఖ చాలా ప్రధానమైనది. వీటి ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అంతేకాక బస్సులు, విమానాలతో పోల్చితే.. వీటి ధర తక్కువగా ఉంటంతో ప్రయాణికులు రైల్లలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వివిధ కారణాలతో తరచూ పలు ప్రాంతాల్లో రైళ్లు పాక్షికంగా రద్దవుతుంటాయి. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని రైల్వే అధికారులు వెల్లడిస్తుంటారు. తాజాగా ఏపీలోని ప్రయాణికులు సౌత్ సెంట్రలో రైల్వే జోన్ కీలక విషయాలను వెల్లడించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రయాణికులకు రైల్వే శాఖ ముఖ్యగమనిక చెప్పింది. వాల్తేరు డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు. వాల్తేరు డివిజన్ పరిధిలో విశాఖ-పలాస, రాయగడ-వియజనగరం సెక్షన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగానే ఆయా మార్గాల్లో వెళ్లే పలు రైళ్లను రద్దుచేసినట్లు ప్రకటనలో తెలియజేశారు.
డిసెంబర్ 3న ట్రైన్ నం.08504 విశాఖ నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్ స్పెషల్, విశాఖ-పలాస(08532) ప్యాసింజర్ స్పెషల్, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) రద్దు అయ్యాయి. అలానే గుంటూరు-రాయగడ(17243) ఎక్స్‌ప్రెస్, విశాఖ,దుర్గ్ మధ్య నడిచే రైళ్లు(18530,18529), హౌరా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(12839, 12840) మెయిల్, వాస్కోడిగామా-షాలిమార్(18048) అమరావతి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
అలానే డిసెంబర్ 4వ తేదీన పలాస-విశాఖ(08531) ప్యాసింజర్, పలాస-విశాఖ(07471) మెము స్పెషల్, విశాఖ-పలాస(07470) మెము స్పెషల్ రద్దయ్యాయి. అలానే డిసెంబర్ 4వ తేదీనే రాయగడ-విశాఖ (08503) పాసింజర్ స్పెషల్, భువనేశ్వర్ నుంటి విశాఖ వెళ్లే రైలు(22819), రాయగడ నుంచి గుంటూరు(17244) ఎక్స్‌ప్రెస్ ను రద్దు చేశారు. అదే విధంగా విశాఖ నుంచి భువనేశ్వర్(22820) ఇంటర్‌సిటీ, బ్రహ్మపుర నుంచి విశాఖ మధ్య నడిచే రైళ్లు (18525,18526), భువనేశ్వర్-విశాఖ(17015) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా ఉత్తర మధ్య రైల్వే ఆగ్రా డివిజన్ లో కూడా ఆధునికీకరణ పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. జనవరి 8,14,15,19,29, ఫిబ్రవరి 2 తేదీల్లో విశాఖ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్(12803) రద్దైంది. జనవరి 10,14,17,21,31, ఫిబ్రవరి 4 తేదీల్లో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి విశాఖ పట్నం వెళ్లే రైలు(12804) రద్దు చేశారు. విశాఖ నుంచి హజ్రత్ నిజాముద్దీన్(12807) సమతా ఎక్స్‌ప్రెస్ జనవరి 9 నుంచి 31, ఫిబ్రవరి 1,2,3,4 తేదీల్లో రద్దైందని అధికారులు తెలిపారు.
హజ్రత్ నిజాముద్దీన్-విశాఖ(12808) జనవరి 11 నుంచి 30, ఫిబ్రవరి 1,2,3,5,6 తేదీల్లో రద్దు చేశారు. అదే విధంగా విశాఖ నుంచి అమృత్‌సర్ వెళ్లే హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్(208207) జనవరి 19,20,23,26,27,30, ఫిబ్రవరి 2,3 తేదీల్లో రద్దైంది. అలానే అమృత్‌సర్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు(20808) జనవరి 21,24,27,28,31, ఫిబ్రవరి 3,4,7 తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.