Dharani
Road Accident: శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఆ వివరాలు..
Road Accident: శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఆ వివరాలు..
Dharani
మరికాసేపట్లో తెల్లవారుతుంది.. తాము ఇంటికి చేరుకుంటాము అని భావించిన వారి జీవితాలు.. రోడ్డు ప్రమాదంలో తెల్లారిపోయాయి. అర్థరాత్రి నడి రోడ్డు మీద క్షతగాత్రలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఎక్కడ చూసినా రక్తం.. గాయాలతో బాధపడుతున్నవారే. ఆ ప్రాంతాన్ని చూస్తే భయంతో కళ్లు తిరుగుతున్నాయి. ఇక ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడగా.. ఏడుగురు మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఆంధప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా రోడ్డు మీద ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా వస్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్, మరో నలుగురు ప్రయాణికులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చెన్నై వైపు వెళుతున్న రెండు లారీలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకుని ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఓ ప్రముఖ ట్రావెల్స్‌కు చెందిన బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరి కొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకుంటామనగా.. ఈ ఘటన జరగడంతో బాధితుల కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు.
#WATCH | Andhra Pradesh | Four dead while 15 people injured after a lorry collided with a bus on Musunuru Toll Plaza, in Nellore District: Kavali DSP Venkataramana pic.twitter.com/MP8ercc92h
— ANI (@ANI) February 10, 2024