Arjun Suravaram
Vizianagaram: తండ్రీ కూతుళ్ల మధ్య ఎక్కువ ప్రేమలు ఉంటాయి. అలానే ఓ తండ్రి కూడా తన బిడ్డను అపురూపంగా పెంచుకున్నాడు. ఆ యువతి కూడా బాగా చదివి.. సాప్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తుంది. అలాంటి ప్రాణానికి ప్రాణమైన కుమార్తె విగతజీవిగా మారింది.
Vizianagaram: తండ్రీ కూతుళ్ల మధ్య ఎక్కువ ప్రేమలు ఉంటాయి. అలానే ఓ తండ్రి కూడా తన బిడ్డను అపురూపంగా పెంచుకున్నాడు. ఆ యువతి కూడా బాగా చదివి.. సాప్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తుంది. అలాంటి ప్రాణానికి ప్రాణమైన కుమార్తె విగతజీవిగా మారింది.
Arjun Suravaram
ప్రతి తల్లిదండ్రులకు తమ బిడ్డలపై ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మధ్య ఎక్కువ ప్రేమలు ఉంటాయి. అలానే ఓ తండ్రి కూడా తన బిడ్డను అపురూపంగా పెంచుకున్నాడు. ఆమె కూడా బాగా చదివి. సాప్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తుంది. ఇక ఆ తండ్రీ ఆనందానికి అవధులు లేవు. అయితే విధి ఆడిన వింత నాటకంలో వారిద్దరు విగతజీవులుగా మారారు. నాన్నా ..కాపాడ అంటూ కుమార్తె ఆర్తనాదాలకు ఆ తండ్రి గుండె ఒక్కసారిగా తల్లడిల్లింది. బిడ్డను కాపాడే ప్రయత్నంలో ఆయన కూడా మరణించాడు. ఈఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామాంలో సూర్యారావు(55), శకుంతల అనే దంపతులు ఉన్నారు. సూర్యారావు ధాన్యం వ్యాపారం చేస్తుంటారు. ఇక ఈ దంపతులకు కుమార్తె సంధ్య(23), కుమారుడు మనోజ్ ఉన్నారు. ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పేదరికం నుంచి బయటకి వచ్చాడు. అతి తక్కువ కాలంలోనే వ్యాపారం మంచి లాభాలు గడించి ఉన్నత స్థికి చేరారు. ఇదే సమయంలో పిల్లలను బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలని ఆశపడ్డారు.
సూర్యారావు దంపతులు అనుకున్నట్లుగానే వారి కుమార్తె సంధ్య సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం పొంది..ఆ రంగంలో స్థిరపడింది. ఇక కొడుకు మనోజ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సంధ్య విశాఖలో ఉద్యోగం చేస్తుండగా, వర్క్‌ఫ్రం హోంలో భాగంగా కొన్నాళ్లుగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తుంది. ఇక కొద్ది రోజుల నుంచి వానలు కురుస్తున్న సంగతి తెలిసింది. శుక్రవారం రాత్రి కూడా వానలు పడ్డాయి. ఈ క్రమంలో వర్షం పడుతుండటంతో ఆరబెట్టిన వస్త్రాలు తెచ్చేందుకు సంధ్య మేడపైకి వెళ్లింది. ఆమె చున్నీ తీసే క్రమంలో గాలికి అది కాస్తా పక్కనే ఉన్న కరెంట్ తీగ తగిలింది.
దీంతో కరెంట్ షాక్ కి గురవడంతో గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న తండ్రి సూర్యరావు మేడపైకి వెళ్లారు. కింద పడి కొట్టుకుంటున్న బిడ్డను చూసి ఏమైందో తెలియక కంగారులో ఆమెను పట్టుకున్నాడు. దీంతో ఆయన కూడా కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఇక వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. అయితే అప్పటికే సంధ్య ప్రాణాలు వదలగా, కొన ఊపిరితో ఉన్న సూర్యారావును విశాఖ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. మొత్తంగా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో కరెంట్ విషాదం నింపింది.