Krishna Kowshik
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటర్ కాగానే.. తొలకరి చినుకులు పలకరిస్తుంటాయి. ఈ వానలు కోసం కేవలం రైతులు మాత్రమే కాదు.. వజ్రాల వేట కోసం కూడా ఆ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏటా అక్కడ జోరుగా వెతుకులాట చోటుచేసుకుంటుంది. తాజాగా
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటర్ కాగానే.. తొలకరి చినుకులు పలకరిస్తుంటాయి. ఈ వానలు కోసం కేవలం రైతులు మాత్రమే కాదు.. వజ్రాల వేట కోసం కూడా ఆ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏటా అక్కడ జోరుగా వెతుకులాట చోటుచేసుకుంటుంది. తాజాగా
Krishna Kowshik
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయంటే.. కొన్ని ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలౌతుంది. ఒక్క వజ్రం దొరికితే చాలు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కినట్లే. అందుకే వజ్రాల ఏరివేతకు తండోపతండాలుగా తరలి వెళుతుంటారు స్థానికులు, ఇతర ప్రాంత ప్రజలు. మహిళలు, వ్యవసాయ కూలీలు, చిన్న పిల్లలు కూడా పొద్దున్నే అక్కడకు చేరుకుని విలువైన రాయిని ఏరుతూ ఉంటారు. ఒక్క రాయి దొరక్కపోదా అని వెతుకులాడుతుంటారు. వ్యాపారులు వారి వద్ద నుండి కొనుగోలు చేస్తుంటారు. దొరికిన డైమండ్‌కు కొంత ధర కడుతుంటారు. ప్రస్తుతం ఆంధ్రా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. దీంతో కర్నూలు జిల్లాలో జోరుగా వజ్రాల వేట మొదలైంది. తాజాగా ఓ వ్యక్తికి విలువైన డైమండ్ లభించింది.
కర్నూలు జిల్లాల్లో తొలకరి చినుకులు పడిన వెంటనే స్థానిక గ్రామస్థలు.. వజ్రాల కోసం వేట ప్రారంభించారు. ఇప్పటికే పలువుర్ని అదృష్ట దేవత వరించింది. తాజాగా ఓ వ్యవసాయ కూలీకి డైమండ్ లభించింది. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా.. మిల మిలా మెరుస్తూ అతడి కంట పడింది. దాన్ని చేత్తో తీసుకుని చూడగా.. వజ్రమోమో అని డౌట్ వచ్చింది. దీనిపై అవగాహన ఉన్నవారికి చూపిస్తే డైమండే అని తేలింది. దీంతో ఓ వ్యాపారి భారీ మొత్తానికి దీన్ని కొనుగోలు చేశారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఈ ఘటన జరిగింది. పొలంలో పనులు చేస్తుండగా.. అతడికి ఈ వజ్రం దొరకడం విశేషం. ఈ విషయం తెలిసిన వజ్రాల వ్యాపారి నగదుతో పాటు బంగారాన్ని ఇచ్చి.. అతడి వద్ద నుండి దీన్ని సొంతం చేసుకున్నాడు.
వ్యవసాయ కూలీకి రూ. 2 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారాన్ని ఇచ్చి ఆ వజ్రాన్ని చేజిక్కించుకున్నాడు ఆ బిజినెస్ మ్యాన్. ఈ విషయం తెలిసి.. ఆ ప్రాంతంలో మరింత జోరుగా వజ్రాల వేట కొనసాగుతుంది. ప్రతి ఏటా తొలకరి వానలు ప్రారంభమయ్యాక కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. కానీ ఈసారి వేసవికాలంలోనే వానలు పడటంతో జనాలు ముందుగానే వజ్రాల కోసం గాలింపు మొదలు పెట్టారు. తుగ్గలి, మద్దికెర మండలాల్లో కొన్నాళ్ల నుండి వజ్రాల వేట కొనసాగుతుంది. ఈ ప్రాంతాల్లో వజ్రాల ఏరివేతకు స్థానికులు మాత్రమే కాదు.. ఇతర జిల్లాల నుండి కూడా ప్రజలు తరలివస్తుంటారు. అలాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుండి కూడా ఇక్కడకు వస్తుంటారు.