iDreamPost
android-app
ios-app

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. APలో ఆ స్టేషన్ వరకు వందేభారత్ ట్రైన్ పొడిగింపు!

రైలు ప్రయాణం చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. వందే భారత్ ట్రైన్ ను ఆ స్టేషన్ వరకు పొడిగించనున్నది రైల్వే డిపార్ట్ మెంట్. ఇంతకీ ఏ స్టేషన్ వరకు అంటే?

రైలు ప్రయాణం చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. వందే భారత్ ట్రైన్ ను ఆ స్టేషన్ వరకు పొడిగించనున్నది రైల్వే డిపార్ట్ మెంట్. ఇంతకీ ఏ స్టేషన్ వరకు అంటే?

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. APలో ఆ స్టేషన్ వరకు వందేభారత్ ట్రైన్ పొడిగింపు!

ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలు నగరాల మధ్య వందే భారత్ ట్రైన్ లు పరుగులు తీస్తున్నాయి. 50కి పైగా వందే భారత్ ట్రైన్స్ ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో ఈ ట్రైన్ లకు ప్రయాణికుల నుంచి ఆధరణ లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- విశాఖ మధ్య వందే భారత్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైల్వే డిపార్ట్ మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్తను అందించింది. ఏపీలోని ఆ స్టేషన్ వరకు వందే భారత్ ట్రైన్ ను పొడిగించనున్నారు.

ఏపీలో ఆ స్టేషన్ వరకు వందే భారత్ ట్రైన్ ను పొడిగించాలని ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో రైల్వే డిపార్ట్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెన్నై–విజయవాడల మధ్య నడుస్తున్న వందేభారత్‌ను భీమవరం వరకు పొడిగించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు చేయగా ఈ వందేభారత్ ట్రైన్ భీమవరం వరకు రానుంది. జులై నెలలో ఈ రైలు భీమవరం స్టేషన్ వరకు రానుంది. ఈ వందే భారత్ ట్రైన్ (20677) చెన్నైలో ఉదయం 5.30కి బయలుదేరుతుంది. విజయవాడకు మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు (20678) అక్కడి నుంచి తిరిగి 3.20కి చెన్నై వెళుతుంది.

Good news for train passengers

అయితే విజయవాడ జంక్షన్ లో రైళ్ల రద్దీ దృష్ట్యా ఫ్లాట్ ఫాం సమస్యగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే వందేభారత్‌ రైలును భీమవరం వరకు పొడిగించాలని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దీనికి చెన్నై రైల్వే కూడా అనుమతి ఇవ్వడంతో బీమవరంకు వందేభారత్ రైలు రానుంది. విశాఖ–సికింద్రాబాద్‌ల మధ్య నడుస్తున్న వందేభారత్‌ ఏలూరు జిల్లాలో ఎక్కడా స్టాప్ లేదు. జిల్లా వాసులు ఈ రైలు ఎక్కాలంటే విజయవాడ, రాజమండ్రి వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు చెన్నై విజయవాడల మధ్య నడుస్తున్న ఈ రైలును భీమవరం వరకు పొడిగించేందుకు రైల్వే అధికారులు రెడీ అయ్యారు.