AP: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే!

ఏపీలో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్‌12(1) (ఈ) ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు 1వ తరగతిలో ఎంపికైన విద్యార్థులు బడిలో చేరేందుకు గడువును అధికారులు పొడగించారు.

ఏపీలో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్‌12(1) (ఈ) ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు 1వ తరగతిలో ఎంపికైన విద్యార్థులు బడిలో చేరేందుకు గడువును అధికారులు పొడగించారు.

కార్పొరేట్‌, ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తుండడంతో వేల రూపాయల డొనేషన్లు, ఫీజులు లేకుండా పేద విద్యార్థులు కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పిస్తోంది. విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుండడంతో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయిస్తూ పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఈ ఉచిత ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు.

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే  2024–25 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాహక్కు చట్టం మేరకు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు కేటాయించాలి. ఈ క్రమంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు.

దరఖాస్తుల స్వీకరణ గడవును మార్చి 31వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. వాస్తవానికి మార్చి 25వ తేదీనే ఈ గడువు ముగియనుంది. నిన్నటికి 47,082 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు  అధికారులు తెలిపారు. అయితే తాజాగా గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆసక్తి ఉన్నవారు సమీపంలోని సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు..మరిన్ని వివరాల కోసం 18004258599 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. ఇలా విద్యార్థుల నుంచి అందిన దరఖాస్తులను రాష్ట్ర స్థాయిలో పరిశీలించి లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేసే ఆయా స్కూళ్లకు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తుంది.

ఇక ఈ 25 శాతం సీట్లకు ఎవరు అర్హులు అంటే.. అనాథ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం చొప్పున మొత్తం 25 శాతం సీట్లను విద్యాహక్కు చట్టం కింద ప్రతి ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో కేటాయిస్తారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1.44 లక్షలు మించి ఉండరాదు. ఇలాంటి వారే.. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశ దరఖాస్తులు అప్లయ్ చేసేందుకు అర్హులు. మరి.. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశల దరఖాస్తు గడువు పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments