iDreamPost
android-app
ios-app

AP ప్రభుత్వం బాటలో కర్ణాటక సర్కార్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు, ఇతర నేతలు అనుసరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏపీ బాటలో నడవగా..తాజాగా కర్ణాటక సర్కార్ కూడా ఆ జాబితాలో చేరనుంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు, ఇతర నేతలు అనుసరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏపీ బాటలో నడవగా..తాజాగా కర్ణాటక సర్కార్ కూడా ఆ జాబితాలో చేరనుంది.

AP ప్రభుత్వం బాటలో కర్ణాటక సర్కార్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిచండమే నిజమైన ఆస్తి అని  భావించిన వ్యక్తి సీఎం జగన్. అందుకే ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మార్చారు. అంతేకాక ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశ పెట్టి…పేద విద్యార్థులకు మంచి అవకాశాలు అందేలే చూస్తున్నారు. విద్యారంగంలో అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇప్పటికే పలు స్కీమ్స్, కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు, నేతలు అనుసరిస్తున్నారు. తాజాగా ఓ విషయంలో ఏపీ బాటలో కర్నాటక  వెళ్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సీఎం జగన్ మార్చేశారు. ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా సర్కార్ బడులను మార్చేశారు. అంతేకాక పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రభుత్వ సూల్స్ లో ప్రవేశ పెట్టారు. అలానే విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు పిక్టోరియల్  డిక్షనరీల విధానాన్ని జగన్ సర్కార్ ప్రవేశ పెట్టింది. ఈ డిక్షనరీ బొమ్మలతో కూడి ఉంటుంది. ఈ డిక్షనరీ విద్యార్థులు ఇంగ్లీష్ ను బాగా అవగాహన చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా విద్యార్థుల్లో భాషా సామర్థ్యాన్ని మెరుగుపరి చేందుకు ఏపీ ప్రభుతవం ప్రవేశ పెట్టిన డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతుంది.

ap government

ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని కర్ణాటక రాష్ట్ర అధికారులు పరిశీలించారు. ఆ ఫలితాలు కర్ణాటక రాష్ట్ర అధికారులు సంతృప్తి చెంది.. తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సహాయంతో కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో డిక్షనరీల తయారీని చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని సిద్ధరామయ్య సర్కార్ భావిస్తోంది.

ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠాల ఆధారంగానే ఏపీ ఎస్సీఈఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్‌ డిక్షనరీని రూపొందించింది. దీంతో పాటు ‘లెర్న్‌ ఏ వర్డ్‌’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్‌ పదాలు నేర్పేలా చర్యలు జగన్ సర్కార్ తీసుకుంది. వాటిని ఎలా పలకాలో, ఎప్పుడు వాడాలో కూడా టీచర్లు శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం కర్ణాటక ప్రభుత్వాన్నిన ఆకర్షించింది. దీంతో వారు కూడా ఏపీఎస్సీఈఆర్టీ సహకారంతో తమ రాష్ట్రంలో కూడా పిక్టోరియల్‌ డిక్షనరీ రూపకల్పనకు చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ఇంగ్లీష్, తెలుగు పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. 2021-22 విద్యా సంవత్సరంలో జగనన్న కానుకలో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదుతున్న 23,72,560 మందికి ఈ డిక్షనరీలోను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. తరువాత ఏడాది 2022–23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. మరి… ఏపీ ప్రభుత్వం బాటలో కర్ణాటక ప్రభుత్వ  వెళ్లనడటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.