iDreamPost
android-app
ios-app

ఇంజినీరింగ్‌ యువతి కాలేజీ నుంచి బయలుదేరిన కాసేపటికే!.. అసలు ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇంజినీరింగ్‌ యువతి కాలేజీ నుంచి బయలుదేరిన కాసేపటికే!.. అసలు ఏం జరిగిందంటే?

ఆ యువతీ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఎన్నో కలలు కన్నది. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను నిజం చేసేదిశగా తన పయణాన్ని కొనసాగించింది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. విధి ఆడిన వింత నాటకంలో అసువులుబాసింది. రోడ్డు ప్రమాదంలో ఆ యువతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కాలేజీ నుంచి బయలుదేరిన కాసేపటికే ఈ ఘోరం జరిగింది. ఉద్యోగం చేసి తమ కష్టాలను తీరుస్తదని అనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఆకస్మికంగా చోటుచేసుకునే ప్రమాదాలు తీరని దుఖాన్ని మిగుల్చుతాయి. అప్పటి వరకు తమతో ఉన్నవారు ఒక్కసారిగా విగత జీవులుగా మారడంతో గుండెలవిసేలా రోదిస్తారు. ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు స్వయంకృత అపరాదం వల్ల, లేదా వాహనదారుల పొరపాట్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల భారిన పడకుండా రోడ్డు భద్రతా సూచనలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ వాహనదారులు అవేమీ పట్టించుకోకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. ఏపీకి చెందిన యువతి కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు స్కూటీపై బయలుదేరి అదుపు తప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయింది.

విజయనగరంలోని గాజుల రేగకు చెందిన బోనెల నందిని (18) స్థానిక సీతం కాలేజీలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. రోజు మాదిరిగానే కాలేజీ ముగించుకుని స్కూటీపై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో నందిని తీవ్రగాయాలపాలైంది. వెంటనే స్పందించిన స్థానికులు నందినిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పుట్టెడు దుఖంలో కూడా నందిని కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. కుటుంబసభ్యులు మృతురాలు నందిని నేత్రాలను తీసుకోవాలని రెడ్‌క్రాస్‌ సోసైటీ ఐ డోనేషన్‌ సెంటర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది కార్నియాలను సేకరించారు. తన కూతురు చనిపోయినా ఆమె అవయవదానంతో మరొకరికి చూపును ప్రసాదించాలన్న ఉద్దేశంతో ఆమె నేత్రాలను దానం చేశామని మృతురాలి తండ్రి పైడిరాజు తెలిపారు. మరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతి కళ్లను దానం చేసిన యువతి కుటుంబ సభ్యులపై మీ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో తెలియజేయండి.