Arjun Suravaram
Election Commission, AP Polling: మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది.
Election Commission, AP Polling: మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది.
Arjun Suravaram
దేశ వ్యాప్తంగా ఎన్నికల హాడావుడి నడుస్తోంది. మొత్తం ఏడు విడుతల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి. నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అంతేకాక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇక నాలుగో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఇక నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది. పోలింగ్ 48 గంటలకు ముందు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో పలు జిల్లాల్లో సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని.. అలాంటి చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
అదే విధంగా పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎండ దెబ్బ తగలకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. ఈ మే 13న నాలుగవ దశలో ఎన్నికల జరిగే రాష్ట్రాల అధికారులతో ఈసీఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో విడతలో 14 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ మే 13న ఎన్నికలు జరుగనున్నా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర పరిశీలకులు, ప్రత్యేక అబ్జర్వర్లు, ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. పోలింగ్ నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలను ఎంతో సున్నితమైనవిగా ఈసీ గుర్తించిందని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల యంత్రాంగం అంతా ఎంతో అప్రమత్తంగా ఉండాలనని సూచించారు.
ఈనెల13న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ ముందు 48 గంటలు ఎంతో కీలకమని ఆయన తెలిపారు. 24 గంటలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని.. ఏమాత్రం హింసకు అవకాశం లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లను ప్రభావితంచేసే నగదు, ఇతర గిఫ్ట్ ల వంటి వస్తువుల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలన్నారు. ప్రత్యేకించి సాధారణ, పోలీస్, ఇతర పరిశీలకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత అనే విషయాన్ని మేసేజ్, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చైతన్య పరుస్తూ ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచాలని ఆదేశించారు.