iDreamPost
android-app
ios-app

Kinjarapu Atchannaidu, EC: అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి EC నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగం మంచి హీట్ మీద ఉంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం కూడా ఎన్నికల రూల్స్ ను అతిక్రమించిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. తమకు అందిన ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగం మంచి హీట్ మీద ఉంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం కూడా ఎన్నికల రూల్స్ ను అతిక్రమించిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. తమకు అందిన ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందిస్తుంది.

Kinjarapu Atchannaidu, EC: అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి EC నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ సమ్మర్ ని మించిపోతుంది. ఇక్కడి రాజకీయ సెగల ముందు వేసవి ఎండలు కూడా సరిపోవడం లేదు. అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. అలానే ప్రతిపక్ష టీడీపీ కూడా సీఎం జగన్ విజయాన్ని అడ్డుకునేదు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నిక కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నిక నియమావళిని అతిక్రమించిన వారికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తుంది. ఇప్పటికే పలువురుకు ఈసీ నోటీసులు జారీ చేయగా.. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి నోటీసులు జారీ చేసింది.

ఇటీవలే ఏపీలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో ఎస్పీలను బదిలీ చేస్తూ  ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలోనే ఇటీవలే ఖాళీ అయిన స్థానాలకు కొత్త ఎస్పీలను, కలెక్టర్లను రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి నియమించారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘంగా రాజకీయ పార్టీలకు, నేతలకు కీలక సూచనలు చేసింది. ఎవరైన అత్రిక్రమించిన, ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు అసత్య ఆరోపణలు చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా నోటీసులు ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే రెండు  రోజుల క్రితం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31న కర్నూలు జిల్లాలోని ఎ‍మ్మిగనూరు నియోజవర్గంలో జరిగిన సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటికి వివరణ ఇవ్వాలని చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించాలు జారీ చేసింది. చంద్రబాబు ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు రావడంతో ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్‌ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. మరి.. ఇలా వివిధ పార్టీల నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారని వస్తున్న ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందిస్తుంది. మరి..తాజాగా అచ్చెన్నాయుడికి ఈసీ నోటీసులు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.