Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. డ్రోన్ విజువల్స్!

విజయనగరం రైలు ప్రమాదం.. డ్రోన్ విజువల్స్!

ఏపీలో విజయనగరంలో ఘోర రైలు ప్రమాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

ఏపీలో విజయనగరంలో ఘోర రైలు ప్రమాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన ఎంతటి విషాదాన్ని మిగిల్చింది అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన నుంచి తేలుకునేలోపే ఏపీలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆగి ఉన్న విశాఖ-పలాస రైలును వెనుకాల నుంచి విశాఖ-రాయగడ ప్యాసెంజర్ ఢీ కొట్టింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికీ వరకు 15 మంది మృతి చెందగా 50 తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో రైల్వే శాఖ మరోసారి ఉలిక్కి పడింది. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఇక చెల్లా చెదురైన మృతదేహాలను బయటకు తీసి గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనతో రైల్వే స్టేషన్ లలో హెల్ప్ లైన్ సెంటర్ లు కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర మంత్రులు సైతం వెంటనే అప్రమత్తమై ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే సెఫ్టీ కమిషనర్ ప్రంజీవ్ సక్సెనా విశాఖకు చేరుకున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. దీంతో పాటు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కూడా జరగనుంది. అయితే ఈ ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ గా మారుతోంది.

Show comments