iDreamPost

ప్రాణాపాయ స్థితిలో బాలుడు.. దేవతలా వచ్చిన డాక్టరమ్మ

Doctor Performed CPR on the Boy: తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ప్రాణాపాయ స్థితిలతో ప్రాణాలు కాపాడి పునర్జన్మనిచ్చేది వైద్యులు అంటారు. అందుకే వైద్యులను దేవుళ్లతో పోల్చుతారు.

Doctor Performed CPR on the Boy: తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ప్రాణాపాయ స్థితిలతో ప్రాణాలు కాపాడి పునర్జన్మనిచ్చేది వైద్యులు అంటారు. అందుకే వైద్యులను దేవుళ్లతో పోల్చుతారు.

ప్రాణాపాయ స్థితిలో బాలుడు.. దేవతలా వచ్చిన డాక్టరమ్మ

తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే.. పునర్జన్మనిచ్చేది వైద్యులు అంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి వైద్యం చేసి ప్రాణాలు పోస్తారు.. అందుకే వైద్యోనారాయణో హరి అంటారు. అందుకే వైద్యులు దేవుళ్లతో సమానం అని అర్థం. అప్పటి వరకు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న ఓ బాలుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు బాబుని భుజాన వేసుకొని హాస్పిటల్ కి బయలు దేరారు. బాలుడు ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో వారి గుండె ఆగినంత పనైంది. ఆ సమయానికి ఓ మహిళా డాక్టర్ వారి వద్దకు వచ్చి చేసిన పని ఇప్పుడు అందరూ హ్యాట్సాప్ చెబుతున్నారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

విజయవాడ అయ్యప్ప నగర్ కి చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) అడుకుంటు ఉండగా కరెంట్ షాక్ తగలడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. వెంటనే పిల్లాడిని తండ్రి భుజంపై వేసుకొని ఆస్పత్రికి పరుగు పెట్టారు. అదే సమయానికి మెడ్‌సీ ఆస్పత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి  అటుగా వస్తుంది.  పరిస్థితి చూసిన రవళి వెంటనే రోడ్డుపైనే బాబుకి సీపీఆర్ అందించింది.

సమయానికి బాలుడికి సీపీఆర్ అందించడం వల్ల  ఊపిరి పీల్చుకున్నాడు. ఆ సమయంలో వైద్యురాలి వృత్తి ధర్మం పరిఢవిల్లింది. ఆమె కృషి ఫలించడంతో బాలుడి ప్రాణాలు నిలబడ్డాయి. తర్వాత తల్లితండ్రులు బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి మెరగైన వైద్యం అందించారు. విజయవాడలో జరిగిన ఈ అపురూప ఘటన గురించి తెలిసి అందరై రవళి సమయస్ఫూర్తి.. వృత్తి ధర్మంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి