iDreamPost
android-app
ios-app

అదృశ్యమవుతున్న గోదారి నీరు..CWC నివేదికలో విస్తుతపోయే నిజాలు!

  • Published Aug 25, 2024 | 12:02 PM Updated Updated Aug 25, 2024 | 12:02 PM

Godavari River Water: గోదావరి నీటిపై సిడబ్య్లుసి నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. గోదావరి నీరు భారీగా మాయమవుతుందని, రోజుకు సగటున 28 టిఎంసిలు మాయం అవుతున్నట్లు నివేదికలోనూ ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి.

Godavari River Water: గోదావరి నీటిపై సిడబ్య్లుసి నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. గోదావరి నీరు భారీగా మాయమవుతుందని, రోజుకు సగటున 28 టిఎంసిలు మాయం అవుతున్నట్లు నివేదికలోనూ ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి.

  • Published Aug 25, 2024 | 12:02 PMUpdated Aug 25, 2024 | 12:02 PM
అదృశ్యమవుతున్న గోదారి నీరు..CWC నివేదికలో విస్తుతపోయే నిజాలు!

సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇటీవల గోదావరి జలాలు అదృశ్యం అవుతున్నాయని ఆ వార్తలోని సారంశం. గోదావరి నీరు ప్రతిఏటా కనపడకుండా మాయమవుతున్నాయట. సాధారణంగా నదీ ప్రవాహంలోని నీళ్లు కొద్దిపాటి పరివాహంలో కనిపించకుండా పోవడం సర్వసాధారణమైన విషయం. కానీ.. గోదావరిలో  నీటి విసయంపై నిపుణులు షాకింగ్ విషయాలు వెల్లడించారు.. ఇక్కడ నీరు సగటున 28.25 టీఎంసీల వరకు నదీ గర్భం నుంచి మాయమవుతుందట. ఇది పోలవరం ప్రాజెక్టు అతి సమీపంలో నదీ నీరు మాయడం కావడం ఆందోళన కలిగించే విషయం అంటున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం (ఎఫ్ఆర్ఎల్) 75.20 టీఎంసీల నీటి వినియోగం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.

ఈ విస్తుపోయే విషయాన్ని సెంట్రల్ వాటర్ కమీషన్ (సీడబ్ల్యూసీ) గణాంకాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎప్పుడో తీసుకువచ్చినట్లు సమాచారం. నీరు మాయం కావడంపై లోతుగా పరిశీలించి, నివారణ చర్యలు తీసుకోవాలని కొంత కాలంగా చెబుతూనే ఉన్నారట. పోలవరం ప్రాజెక్ట్ సమగ్ర అధ్యాయన నివేదికలో సైతం ఈ విషయాన్ని ప్రశ్నించారు. ఈ పరిణామం భవిష్యత్ లో ప్రాజెక్ట్ భద్రతకు ప్రశ్నార్థకంగా మారుతుందని రాష్ట్రంలోని నీటి పారుదల రంగ నిపుణులు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రాజెక్ట్ భద్రతతో పాటు, నీటి వినియోగానికి సంబంధించిన కీలక విషయాలు విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడికి సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఒక లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

1977 నుంచి 2006 వ సంవత్సరం వరకు దాదాపు 29 ఏళ్ల పాటు గోదావరి నీటి ప్రవాహాన్ని అధ్యయనం చేసిన CWC ఈ నిర్ధారణకు రావడం గమనార్హం. పోలవరానికి 52 కిలోమీటర్ల ఎగువన ఉన్న కోయిదా నుంచి ఈ పరిశీలన మొదలైంది. ప్రతి ఏటా భారీ మొత్తంలో గోదావరి నుంచి నీళ్లు మాయమవుతున్నట్లు నిర్ధారించింది. 1983 లో ఆగస్టు 15 న కోయిదా వద్ద గోదావరి నదిలో 58,616 క్యుసెక్కుల ప్రవాహం ఉంటే.. పోలవరం వద్దకు చేరుకునే సరికి 40,176 క్యుసెక్కులకు తగ్గిపోతుందని గుర్తించారు అధికారులు. 1986 లో కొయిదా వద్ద 1,552 టీఎంసీల నీరు వెళ్లగా.. పోలవరం వద్దకు వచ్చేసరికి 1,345 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే 207 టీఎంసీల నీరు తేడా వచ్చింది. అలాగే పేరూజ్ గేట్ వద్ద 2,369 టీఎంసీల నీరు ప్రవహించగా.. కోయిదాకు వచ్చే సరికి 3,218 టీఎంసీలకు ఉంది. అయితే సమస్య మొత్తం కోయిదా నుంచి పోలవరం వరకు పోతున్న ప్రవాహం వద్దే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారులు. వరద తీవ్రతతో సంబంధం లేకుండా.. గోదావరిలోని ఈ ప్రాంతంలో నీరు ప్రతి సంవత్సరం అదృశ్యం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు సమర్పించిన నివేధికలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కోయిదా నుంచి పోలవరం మద్య ఎలాంటి డ్యామ్, ఎత్తిపోతల పథకాలు కానీ లేవు. మధ్యలో మాత్రం కొన్ని వాగులు, వంకల నుంచి అదనంగా నీరు చేరుతుంది. అలాంటపుడు ఆ నీరు పోలవరానికి వచ్చేలోపు ప్రవాహం పెరిగిపోవాలి.. తగ్గకూడదు. కానీ ఇందుకు భిన్నంగా దాదాపు 30 టీఎంసీలకు పైగా నీరు అదృవ్యం అవుతుందని నిపుణుల చెబుతున్నారు. అంటే సగటున 28.25 టీఎంసీలుగా ఈ నీరు ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్ట్ భద్రతలతపై అనుమానావు వ్యక్తం చేస్తున్నారు.

ఇక పోతే గోదారి నీరు పెద్ద మొత్తంలో భూమి లోపలి పొరల్లోకి (బిగ్ డీప్ బెడ్ ప్రొఫైల్) ఇంకిపోతున్నాయని CWC వెల్లడించింది. దాదాపు 52 కిలోమీటర్ల పరిధిలో ఖచ్చితంగా ఎక్కడ ఈ ప్రక్రియ జరుగుతుందన్న విషయం గుర్తించలేకపోయామని.. అక్కడ లీకేజీని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలవరానికి దాదాపు 200 కిలో మీటర్ల ఎగువన ఉన్న ఖమ్మం జిల్లాలోని గుండ్లవాగు ప్రాజెక్ట్ వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి ఉందని సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. పోలవరం ప్రాజెక్ట్ తో పోలిస్గే గుండ్లవాగు సమీపంలో భూమిలోకి ఇంకుతున్న నీటి పరిమాణం చాలా తక్కువ అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని ఆపలేకపోయామని ప్రభుత్వానికి ఇచ్చిన నివేధికలో నిపుణులు పేర్కొన్నారు. పైగా ఈ రెండు ప్రాంతాల్లో భూమి లోపల నిర్మాణం దాదాపు ఒకేలా ఉన్నాయని చెప్పడం గమనార్మం. ఇక దీని ప్రభావం పోలవరంపై ఉంటుందా అన్న అనుమానాల నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే.. పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీటర్లు (150 అడుగులు) ఎత్తతో ఉంది. రోజుకు 32.5 టీఎంసీలు, 41.15 మీటర్ల (135 అడుగుల ) వుంటే రోజుకు 24 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి అదృశ్యమవుతున్నాయని సీడబ్ల్యూసీ నివేదికలో వెల్లడించారు.

ఈ అంశంపై డీపీఆర్ లో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ గనక 45.72 మీటర్ల ఎత్తు కడితే రాష్ట్రంలో ముంపు ప్రాంతాల్లో అపాయం పెరిగిపోవడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని నిపుణుల తెలిపారు. అదే 41.15 మీటర్లు అయితే పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి రాకపోక, రాష్ట్రంలో ముంపు ప్రాంతం కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉందని అన్నారు. నదీ గర్భంలోనే భూమిలోకి నీరు ఇంకిపోవడం మాత్రం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని పెంచి గోదావరి లో వరదలు ఉన్నపుడు ఎక్కువ నీటిని తీసుకోవడం ఒక్కటే దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు.