ఏపీ మందుబాబులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై నో టెన్షన్, ఆ సమస్య ఉండదు!

ఏపీ మందుబాబులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై నో టెన్షన్, ఆ సమస్య ఉండదు!

రాష్ట్రంలో మందుబాబులకు ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. ఇకపై ఆ విషయంలో టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు.

రాష్ట్రంలో మందుబాబులకు ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. ఇకపై ఆ విషయంలో టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు.

ప్రస్తుత కాలంలో మద్యం తాగిని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే.. ఇప్పుడున్న సమాజంలో పెద్దవాళ్ల దగ్గర నుంచి చదువుకుంటున్న విద్యార్థులు సైతం మద్యన్ని సేవించడం కామన్‌ అయిపోయింది. ముఖ్యంగా.. బర్త్‌డే పార్టీ మొదలు వివాహ వేడుకలని అఖరికి చావు కార్యక్రమాల దగ్గర కూడా చుక్క తప్పని సరిగా ఉండాల్సిందే. ఇక అదిలేకపోతే ఏదో వెలుతుగా ఉన్నట్లు ఫీల్‌ అవుతారు. అలాగే ఉద్యోగస్తులు అయితే వీకెండ్‌ వస్తే చాలు..వీరి హంగామా వెరే లెవల్‌ లో ఉంటుంది. అయితే చుక్క వేస్తే చిల్‌ గా ఫీల్‌ అయ్యే మందుబాబలుకు మద్యం షాప్‌ కు వెళ్తే కాస్త ఇరిటేట్‌ అవుతరనే చెప్పవచ్చు. ఎందుకంటే.. మద్యం షాపులో క్యూ లైన్‌ లో నిల్చొవడం, అలాగే చేతిలో సరిపడా డబ్బులు లేకపోవడం, చిల్లర సమస్య అనేది ఎక్కువ చిరెత్తిస్తుంది. కానీ, ఇకపై మందుబాబులకు అలాంటి టెన్షన్‌ చెందాల్సిన అవసరం లేదు. తాజాగా రాష్ట్రంలోని మద్యం ప్రియులకు అదిరే శుభవార్త అందింది. ఇకపై మద్యం షాపుల్లో డిజిటిల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా మందుబాబులకు ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. ఇకపై క్యాష్ టెన్షన్ లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల్లో డిజిటిల్ లావాదేవీలు నిర్వహిస్తోంది. అయితే ఈ సేవలు అనేవి కొన్ని జిల్లాలోని షాపుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని జిల్లాల్లోని మద్యం షాపులో  70 నుంచి 80శాతం వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. వాటిలో ఎక్కువగా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, కార్డుల ద్వారా వినియోగదారులు చెల్లింపులు జరుపుతున్నారు. కొంతమంది మాత్రం అక్కడక్కడా క్యాష్ తీసుకెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. కానీ, గతంలో మద్యం షాపుల్లో కేవలం క్యాష్ ద్వారా చెల్లింపులు జరిగేవి. ఎక్కడ కూడా డిజిటల్‌ చెల్లింపులకు అనుమతి ఉండేది కాదు. అయితే గతంలో మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.

దీంతో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఈ ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా.. మద్యం షాపుల్లో నగదు పక్కదారి పడుతోందనేది ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇక మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్యాష్ చెల్లింపుల్ని మాత్రమే అనుమతించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి సాయంత్రం వరకు డిజిటల్ చెల్లింపులు తీసుకొని, ఆ తర్వాత క్యాష్‌ తీసుకుంటున్నారు.  మరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మద్యంషాపుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments