iDreamPost
android-app
ios-app

కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ!

Nara Chandrababu: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే పులివెందులకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎస్.సతీష్ రెడ్డి వైసీపీలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలులో చంద్రబాబు మరో భారీ షాక్ తగిలింది.

Nara Chandrababu: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే పులివెందులకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎస్.సతీష్ రెడ్డి వైసీపీలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలులో చంద్రబాబు మరో భారీ షాక్ తగిలింది.

కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించిన తరువాత.. ఈ వేడీ తీవ్ర స్థాయికి చేరింది. జనసేన, టీడీపీలో టికెట్ ఆశించి కొందరు ముఖ్య నేతలకు భంగపాటు ఎదురైంది. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన పలువురు నేతలు ఆ పార్టీని వీడి బాబుకు గట్టి షాకిస్తున్నారు. నిన్ననే కడప జిల్లాలో చంద్రబాబుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎస్.సతీష్ రెడ్డి వైఎస్సార్ సీపీలోకి చేరాడు. ఇక తాజాగా కర్నూలు జిల్లాలో బాబుకు మరో భారీ దెబ్బ తగిలింది.

ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి ఎందరో నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఈ జిల్లాకు చెందిన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. ఇక్కడి రాజకీయం టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య పోటా పోటీగా ఉంటుంది. అయితే వైఎస్సార్ సీపీ కే ఇక్కడ కాస్తా ఎక్కువ మొగ్గు ఉంటుంది. అందుకే ఇక్కడ టీడీపీని బలపేతం చేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తలిగిన సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ జిల్లాలో కొన్ని స్థానాలైనా గెలవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అయితే చంద్రబాబు చేసే కొన్ని ఘనకార్యాల వలన ఆ పార్టీకి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  ముఖ్యంగా ఇటీవల కాలంలో టీడీపీకి ఎదురు గాలి వీస్తోంది. తాజాగా డోన్ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నేత ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డి చంద్ర‌బాబునాయుడికి గ‌ట్టి షాక్ ఇచ్చారు. డోన్‌లో ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో ఏర్పాటు చేసిన జెండాల్లో దివంగ‌త,మాజీ సీఎం ఎన్టీఆర్‌తో పాటు సుబ్బారెడ్డి ఫొటోలు మాత్ర‌మే ఉన్నాయి. చంద్ర‌బాబు, లోకేశ్ ఫొటోలు లేకుండా ర్యాలీ నిర్వ‌హించాడు.

దీంతో సుబ్బారెడ్డి రెబ‌ల్ అభ్య‌ర్థిగా బరిలో దిగుతార‌నే ప్ర‌చారం స్థానికంగా ఊపందుకుంది. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన మొట్టమెదటి అభ్య‌ర్థి ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డి. ఇక్క‌డి నుంచి ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఎలాగైనా రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో డోన్ లో నిర్వహించిన టీడీపీ సభలో సుబ్బారెడ్డే డోన్ నుంచి పోటీ చేస్తారని చెప్పారు. దీంతో అప్ప‌టి నుంచి సుబ్బారెడ్డి ప్రజల్లో తిరుగుతూ ప్రచారంలో మునిగిపోయారు. అంతేకాక కోట్లాది రూపాయ‌లు ఖర్చు పెట్టుకుని డోన్ లో టీడీపీని కాపాడుకుంటూ వ‌స్తున్నారు. తీరా ఎన్నిక‌ల స‌మీపించిన వేళ సుబ్బారెడ్డికి బ‌దులు కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డికి చంద్రబాబు టికెట్ ఖ‌రారు చేశారు.

దీంతో సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నట్లు సమాచారం. శుక్రవారం డోన్‌లో కేఈ కృష్ణ‌మూర్తి కుటుంబంతో క‌లిసి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఆ ర్యాలీకి పోటీగా సుబ్బారెడ్డి ఇవాళ భారీ ర్యాలీ చేప‌ట్టి చంద్ర‌బాబుకు వార్నింగ్ పంపారనే టాక్ వినిపిస్తోంది. సుబ్బారెడ్డి ర్యాలీలో ఎక్కడా చంద్ర‌బాబు, లోకేశ్‌ ఫొటోలు కనిపించకపోవడం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రానున్న ఎన్నిక‌ల్లో సుబ్బారెడ్డి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా లేదా కాంగ్రెస్ నుంచి బ‌రిలో దిగుతార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏది ఏమైనా సుబ్బారెడ్డి ఇలా చేయడంతో డోన్‌లో రాజ‌కీయ చంద్ర‌బాబుకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.