iDreamPost
android-app
ios-app

లిల్లీ యాప్ పేరుతో మోసం.. లక్షల్లో మోసపోయిన బాధితులు

మరో మోసం వెలుగులోకి వచ్చింది. లిల్లీ యాప్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు. కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బోర్డు తిప్పేసారు. ఈ ఘరానా మోసం ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

మరో మోసం వెలుగులోకి వచ్చింది. లిల్లీ యాప్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు. కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బోర్డు తిప్పేసారు. ఈ ఘరానా మోసం ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

లిల్లీ యాప్ పేరుతో మోసం.. లక్షల్లో మోసపోయిన బాధితులు

ఈజీ మనీకోసం అలవాటు పడిన కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బును సంపాదించాలనే అత్యాశతో మోసాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది లక్షలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఇదివరకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అని చెప్పి జనాలను మోసగించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే రీతిలో ఇప్పుడు మరో మోసం వెలుగులోకి వచ్చింది. లిల్లీ యాప్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు. కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బోర్డు తిప్పేసారు. ఈ ఘరానా మోసం ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

తాజాగా లిల్లీ యాప్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బు ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డారు యాప్ నిర్వాహకులు. తక్కువ సమయంలోనే రెట్టింపు డబ్బు వస్తందన్న ఆశతో పలువురు లిల్లీ యాప్ లో భారీగా పెట్టుబడి పెట్టారు. అయితే లిల్లీ యాప్ నిర్వాహకులు మొదట్లో డబ్బుకట్టిన వారిని నమ్మించేందుకు కొందరి అకౌంట్లలో డబ్బులు జమచేసింది. దీంతో ఈ యాప్ లో మరింత మంది పెట్టుబడి పెట్టారు. తీరా చూస్తే ఈ యాప్‌ నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో ప్రస్తుతం బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. లిల్లీయాప్ లో రూ.1000 నుంచి దాదాపు రూ.10లక్షలు కూడా ఇందులో చెల్లించిన వారు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో బాధితులు దాదాపు రూ.7 కోట్లకుపైగానే కంపెనీకి చెల్లించి ఉంటారని చెబుతున్నారు. ప్రధానంగా పుంగనూరు, మదనపల్లె, సోమల, చౌడేపల్లె, పలమనేరు, చిత్తూరు, తిరుపతి బి.పి.అగ్రహారం, ప్రాజెక్టువీధి, తదితర ప్రాంతాలకు చెందిన వాళ్లు భారీగా మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే బాధితులందరూ తిరుపతిలోని సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లిల్లీ ఫార్మా మార్కెటింగ్‌ కంపెనీ పుంగనూరు బ్రాంచ్‌ నిర్వాహకురాలు నౌహిర బేగంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు వెల్లడించారు.